Song » Life is Beautiful (pop) / లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (పాప్)
Song Details:Actor :
Abhijit / అభిజిత్ ,Actress :
Amala / అమల ,
Shreya / శ్రేయ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer :
Sree ramachandra / శ్రీ రామచంద్ర ,Song Category : Others
pallavi: lEta lEta cigurulAMTi ASa ASayaMga mArutuMdi nEDu kommagAli tIsukunna SvAsa kottapATa pADutuMdi cUDu UDala nIDana Ugina Uhalu urikenu urumulu adirElA Akula nIDana ADina manasulu Agavu IvELa aMtA okkaTai naDicE bATalO laiP Ij byUTiPul laiP Ij byUTiPul okaTE goMtugA palikE pATalO laiP Ij byUTiPul laiP Ij byUTiPul lEta lEta ciguru caraNaM1: ciMdulatO katha modalainA ciMtalanu malupulalOna cEyi viDuvani celimaMTE mAdErA! mAdErA! mAdErA! mAdErA! paMtamulu viDadIstunnA baMdhamulu penavEstuMTE prEma balapaDutuMdaMTE ninnainA, nIDainA rEpainA, eppuDainA remmalatO niMgini tAkinA nElanE vadalavu vELlu telusukOmannadi Akula nIDana ADina manasulu I allari allari allari jIvitaM laiP Ij byUTiPul laiP Ij byUTiPul kAlaM malupulO tuMTari vayasulO snEhaM velugulO laiP Ij byUTiPul laiP Ij byUTiPul prEmala nIDalO, tuLLu UhalO aMdari tODulO laiP Ij byUTiPul Click here to hear the song
పల్లవి: లేత లేత చిగురులాంటి ఆశ ఆశయంగ మారుతుంది నేడు కొమ్మగాలి తీసుకున్న శ్వాస కొత్తపాట పాడుతుంది చూడు ఊడల నీడన ఊగిన ఊహలు ఉరికెను ఉరుములు అదిరేలా ఆకుల నీడన ఆడిన మనసులు ఆగవు ఈవేళ అంతా ఒక్కటై నడిచే బాటలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఒకటే గొంతుగా పలికే పాటలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లేత లేత చిగురు చరణం1: చిందులతో కథ మొదలైనా చింతలను మలుపులలోన చేయి విడువని చెలిమంటే మాదేరా! మాదేరా! మాదేరా! మాదేరా! పంతములు విడదీస్తున్నా బంధములు పెనవేస్తుంటే ప్రేమ బలపడుతుందంటే నిన్నైనా, నీడైనా రేపైనా, ఎప్పుడైనా రెమ్మలతో నింగిని తాకినా నేలనే వదలవు వేళ్లు తెలుసుకోమన్నది ఆకుల నీడన ఆడిన మనసులు ఈ అల్లరి అల్లరి అల్లరి జీవితం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కాలం మలుపులో తుంటరి వయసులో స్నేహం వెలుగులో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రేమల నీడలో, తుళ్ళు ఊహలో అందరి తోడులో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment