Song » Atu Itu Ugutoo / అటు ఇటు ఊగుతూ
Song Details:Actor :
Abhijit / అభిజిత్ ,Actress :
Amala / అమల ,
Shreya / శ్రేయ,Music Director :
Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్,Lyrics Writer :
Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer :
Sree ramachandra / శ్రీ రామచంద్ర ,Song Category : Love & Romantic Songs
pallavi: aTu iTu UgutU alajaDi rEputai tikamaka peMcutOMdi manasu kEmayiMdi cakacaka dUkutU taDabaDi tuLlutU talapuni tarumutOMdi vayasu kEmayiMdi nIvalanE idilA modalaiyiMdE nA mATE vinadE, prEmA E? nA prANaM tiMTAvu ninnE talacEvaraku prEmA E? nA veMTE vuMTAvu nIlA mArE varaku caraNaM1: jAbiliki jalubunu teccE caluva nIvE sUryuDiki cemaTalu paTTE vEDi nIvE mEGamuni melikalu tippE merupu nIvE kAlamuni kalalatO niMpE kathavi nIvE maunaM nI BAShayitE cirunavvE kavitautuMdE nI kanula kAvyAnnE cadivEyamannadE nI valanE idilA autuMdE nA mATE vinadE... prEma EM? caraNaM2: mAmuluga anipistuMdE nuvvu vastE mAyamani telisostuMdE lOtu cUstE maMTavale velugistAvE dUramuMTE maMcuvale lAlistAvE cEruvaitE virabUsE puvvainA marunADE cUstadi aMdaM nuvvu pUstE nUrELLU virisEnu jIvitaM nIvalanE idilA jarigiMdE nA mATE vinadE....prEma EM? Click here to hear the song
పల్లవి: అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ తికమక పెంచుతోంది మనసు కేమయింది చకచక దూకుతూ తడబడి తుళ్లుతూ తలపుని తరుముతోంది వయసు కేమయింది నీవలనే ఇదిలా మొదలైయిందే నా మాటే వినదే, ప్రేమా ఏ? నా ప్రాణం తింటావు నిన్నే తలచేవరకు ప్రేమా ఏ? నా వెంటే వుంటావు నీలా మారే వరకు చరణం1: జాబిలికి జలుబును తెచ్చే చలువ నీవే సూర్యుడికి చెమటలు పట్టే వేడి నీవే మేఘముని మెలికలు తిప్పే మెరుపు నీవే కాలముని కలలతో నింపే కథవి నీవే మౌనం నీ భాషయితే చిరునవ్వే కవితౌతుందే నీ కనుల కావ్యాన్నే చదివేయమన్నదే నీ వలనే ఇదిలా ఔతుందే నా మాటే వినదే... ప్రేమ ఏం? చరణం2: మాములుగ అనిపిస్తుందే నువ్వు వస్తే మాయమని తెలిసొస్తుందే లోతు చూస్తే మంటవలె వెలుగిస్తావే దూరముంటే మంచువలె లాలిస్తావే చేరువైతే విరబూసే పువ్వైనా మరునాడే చూస్తది అందం నువ్వు పూస్తే నూరేళ్ళూ విరిసేను జీవితం నీవలనే ఇదిలా జరిగిందే నా మాటే వినదే....ప్రేమ ఏం? ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment