Song » Pillalu Devudu / పిల్లలు దేవుడు
Song Details:Actor :
N/A / వర్తించదు ,Actress :
Baby (kutti) Padmini / బేబీ (కుట్టి) పద్మిని ,Music Director :
M.S.Vishwanaadhan / ఎమ్.ఎస్.విశ్వనాధన్ ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Children Songs
pallavi : pillalu daevuDu challani vaarae kallakapaTamerugani karuNaamayulae pillalu daevuDu challani vaarae kallakapaTamerugani karuNaamayulae tappulu manniMchuTae daevuni suguNaM idi goppavaaLLu cheppinaTTi chakkani j~naanaM tappulu manniMchuTae daevuni suguNaM idi goppavaaLLu cheppinaTTi chakkani j~naanaM pillalu daevuDu challani vaarae kallakapaTamerugani karuNaamayulae charaNaM : 1 puTTinapuDu manishi manasu terachiyuMDunu puTTinapuDu manishi manasu terachiyuMDunu aa puruTikaMdu manasulO daivamuMDunu aa puruTikaMdu manasulO daivamuMDunu vayasu perigi eesu kaligi madamu hechchitae vayasu perigi eesu kaligi madamu hechchitae aMta manishilO daevuDae maayamagunulae aMta manishilO daevuDae maayamagunulae pillalu daevuDu challani vaarae kallakapaTamerugani karuNaamayulae charaNaM : 2 velugutunna sooryuNNi mabbu mooyunu velugutunna sooryuNNi mabbu mooyunu manishi teliviyanae sooryuNNi kOpaM mooyunu manishi teliviyanae sooryuNNi kOpaM mooyunu gaali veecha mabbu teralu kadalipOvulae gaali veecha mabbu teralu kadalipOvulae maaTa kalupukunna kOpamae chelimi agunulae maaTa kalupukunna kOpamae chelimi agunulae pillalu daevuDu challani vaarae kallakapaTamerugani karuNaamayulae charaNaM : 3 perigi perigi pillalae peddalauduru perigi perigi pillalae peddalauduru aa peddalaemO kalahistae chinnabOduru aa peddalaemO kalahistae chinnabOduru maayamarmamaemi laeni baalalaMdaru maayamarmamaemi laeni baalalaMdaru ee bhoomipaina velasina puNyamoortulae ee bhoomipaina velasina puNyamoortulae pillalu daevuDu challani vaarae kallakapaTamerugani karuNaamayulae Click here to hear the song
పల్లవి : పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే చరణం : 1 పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును ఆ పురుటికందు మనసులో దైవముండును ఆ పురుటికందు మనసులో దైవముండును వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే అంత మనిషిలో దేవుడే మాయమగునులే అంత మనిషిలో దేవుడే మాయమగునులే పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే చరణం : 2 వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును మనిషి తెలివియనే సూర్యుణ్ణి కోపం మూయును మనిషి తెలివియనే సూర్యుణ్ణి కోపం మూయును గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే చరణం : 3 పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు మాయమర్మమేమి లేని బాలలందరు మాయమర్మమేమి లేని బాలలందరు ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment