Saturday, July 11, 2020

Lava Kusha » Ramakathanu Vinarayyaa      లవకుశ » రామకథను వినరయ్యా

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Ramakathanu Vinarayyaa / రామకథను వినరయ్యా
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Anjali devi / అంజలి దేవి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : P. Leela / పి. లీల ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Folk Songs
raamakathanu vinarayyaa
raamakathanu vinarayyaa
ihapara suKamulanosagE
sItaaraamakathanu vinarayyaa



ayOdhya nagaraaniki raaju dasharatha mahaaraaju
aa raajulu raaNulu muvvuru
kausalya sumitra kaikEyi
nOmu Palamulai vaariki kaligiri komarulu nalvuru
raama lakShmaNa bharata shatruGnulu
aa..aa..aa..aa..aa



raamakathanu vinarayyaa
ihapara suKamulanosagE
sItaaraamakathanu vinarayyaa



GaDiya Emi raGuraamuni viDaci gaDupalEni aa pUjani
kaushika yaagamu kaaci rammani
kaushika yaagamu kaaci rammani
palikenu nIradashyaamuni
raamakathanu vinarayyaa



taaTaki dunimi jannamu gaaci
tapasula dIvana taladaalci
janakuni yaagamu cUcu nepammuna
janakuni yaagamu cUcu nepammuna
caniyenu mithilaku daasharathi
raamakathanu vinarayyaa



madanakOTi sukumaaruni kanugoni
mithilaku mithilayE murisinadi
dharaNija madilO merasina mOdamu
aa..aa..aa..aa..aa
kannula vennela vIcinadi
raamakathanu vinarayyaa



haruni villu raGunaathuDu cEgoni
ekkiDa PeLa PeLa viriginadi
kaLakaLalaaDE sItaaraamula
aa..aa..aa..aa..aa
kaLakaLalaaDE sItaaraamula
aa..aa..aa..aa..aa
kaLakaLalaaDE sItaaraamula
kannulu karamulu kalipinavi
raamakathanu vinarayyaa
ihapara suKamulanosagE
sItaaraamakathanu vinarayyaa




 
Click here to hear the song
రామకథను వినరయ్యా
రామకథను వినరయ్యా
ఇహపర సుఖములనొసగే
సీతారామకథను వినరయ్యా



అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు
ఆ రాజులు రాణులు మువ్వురు
కౌసల్య సుమిత్ర కైకేయి
నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు
ఆ..ఆ..ఆ..ఆ..ఆ



రామకథను వినరయ్యా
ఇహపర సుఖములనొసగే
సీతారామకథను వినరయ్యా



ఘడియ ఏమి రఘురాముని విడచి గడుపలేని ఆ పూజని
కౌశిక యాగము కాచి రమ్మని
కౌశిక యాగము కాచి రమ్మని
పలికెను నీరదశ్యాముని
రామకథను వినరయ్యా



తాటకి దునిమి జన్నము గాచి
తపసుల దీవన తలదాల్చి
జనకుని యాగము చూచు నెపమ్మున
జనకుని యాగము చూచు నెపమ్మున
చనియెను మిథిలకు దాశరథి
రామకథను వినరయ్యా



మదనకోటి సుకుమారుని కనుగొని
మిథిలకు మిథిలయే మురిసినది
ధరణిజ మదిలో మెరసిన మోదము
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కన్నుల వెన్నెల వీచినది
రామకథను వినరయ్యా



హరుని విల్లు రఘునాథుడు చేగొని
ఎక్కిడ ఫెళ ఫెళ విరిగినది
కళకళలాడే సీతారాముల
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కళకళలాడే సీతారాముల
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కళకళలాడే సీతారాముల
కన్నులు కరములు కలిపినవి
రామకథను వినరయ్యా
ఇహపర సుఖములనొసగే
సీతారామకథను వినరయ్యా
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment