
Song » Aa Vennela Edaina / ఆ వెన్నెలేదైనా
Song Details:Actor :
Naga shourya / నాగ శౌర్య ,Actress :
avika Gor / అవికా గోర్ ,Music Director :
K.M.Radha Krishnan / కె.యమ్.రాధాకృష్ణన్ ,Lyrics Writer :
Vanamaali / వనమాలి ,Singer :
Hema chandra / హేమచంద్ర ,
Sunitha / సునీత ,Song Category : Love & Romantic Songs
A vennelEdainA nI navvulOdEnA harivillu vannellO prati raMgu nIdEnA gOdAri poMgullO nI guMDe savvaLlEnA EkAMta vennellOnA... pasi kOyilamma pATalO nI goMtu viMTunnA tuLliMtanauvutunnA... nelaveMka nIDallO nI mOmu cUstunnA gOdAri poMgullO nI guMDe savvaLlEnA EkAMta vennellOnA... virabOsE prati tOTa nI pedavula cirunavvA svaramayyE pratimATa nI padamula sirimuvva sirilennO toNikiMdi nuvu naDicina pratitOva madi hAyilOnA tElagA cirugAli vIciMdO nI SvAsa tAgiMdO tanuvaMtA vUgElA E mattu tAkiMdO gOdAri poMgulOnA nI guMDe savvaLLEnA EkAMta vELallOnA.. selayErai urikiMdA ninu cEragA nI pAdamu kaDalallE egisiMdA aNuvaNuvuna AnaMdaM kalanainA viDipOdA mana iruvuri anubaMdhaM gata jAvaLilu pADagA... mana jaMTa snEhaMlO tolimaMcu vIDiMdA valapaMTi A mEGaM cirujallu calliMdA gOdAri poMgullOnA nI guMDe savvaLlEnA EkAMta vELallOnA pasi kOyilamma pATalO nI goMtu viMTunnA tuLLiMtanautunnA nelavaMka nIDallO nI mOmu cUstunnA gOdAri poMgullOnA.. nI guMDe savvaLlEnA EkAMta vELallOnA...
ఆ వెన్నెలేదైనా నీ నవ్వులోదేనా హరివిల్లు వన్నెల్లో ప్రతి రంగు నీదేనా గోదారి పొంగుల్లో నీ గుండె సవ్వళ్లేనా ఏకాంత వెన్నెల్లోనా... పసి కోయిలమ్మ పాటలో నీ గొంతు వింటున్నా తుళ్లింతనౌవుతున్నా... నెలవెంక నీడల్లో నీ మోము చూస్తున్నా గోదారి పొంగుల్లో నీ గుండె సవ్వళ్లేనా ఏకాంత వెన్నెల్లోనా... విరబోసే ప్రతి తోట నీ పెదవుల చిరునవ్వా స్వరమయ్యే ప్రతిమాట నీ పదముల సిరిమువ్వ సిరిలెన్నో తొణికింది నువు నడిచిన ప్రతితోవ మది హాయిలోనా తేలగా చిరుగాలి వీచిందో నీ శ్వాస తాగిందో తనువంతా వూగేలా ఏ మత్తు తాకిందో గోదారి పొంగులోనా నీ గుండె సవ్వళ్ళేనా ఏకాంత వేళల్లోనా.. సెలయేరై ఉరికిందా నిను చేరగా నీ పాదము కడలల్లే ఎగిసిందా అణువణువున ఆనందం కలనైనా విడిపోదా మన ఇరువురి అనుబంధం గత జావళిలు పాడగా... మన జంట స్నేహంలో తొలిమంచు వీడిందా వలపంటి ఆ మేఘం చిరుజల్లు చల్లిందా గోదారి పొంగుల్లోనా నీ గుండె సవ్వళ్లేనా ఏకాంత వేళల్లోనా పసి కోయిలమ్మ పాటలో నీ గొంతు వింటున్నా తుళ్ళింతనౌతున్నా నెలవంక నీడల్లో నీ మోము చూస్తున్నా గోదారి పొంగుల్లోనా.. నీ గుండె సవ్వళ్లేనా ఏకాంత వేళల్లోనా...
0 comments:
Post a Comment