Friday, July 24, 2020

Lakshadhikari » Naa chempa taakagaane      లక్షాదికారి » నా చెంప తాకగానే

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Naa chempa taakagaane / నా చెంప తాకగానే

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Krishna kumari / కృష్ణ కుమారి  ,Music Director : T.Chalapathi Rao / టి.చలపతి రావు  ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
hAy hAy hAy

nA ceMpa tAkagAnE

celI nI cEyi

kaMdenEmO

nA cUpu sOkagAnE

arere nAjUku

taggenEmO

||ceMpa||


nApaina nIku kOpamA

kAdEmi virahatApamA

nApaina nIku kOpamA

virahatApamA

palukagArAdA aluka mariyAdA

nI padunau cUpula adiriMpulaku

bedaranu bedaranu bedaranulE


pallavi :
dAcAlaMTE dAgadulE

dAguDumUtalu sAgavulE

valapula saMkela bigisEdAkA

vadalanu vadalanu vadalanulE


caraNaM : 1 
nI kuluku naDaka cUci

rAjahaMsalaku siggu kalige

nI taLuku mOmu cUci

niMgi jAbiliki siggu tarige

kuluku||

ayyArE mEni aMdamu

baMgAru tIga caMdamu

ayyArE mEni aMdamu

tIga caMdamu

marulugolipEnU manasu dOcEnU

I kammani rAtiri karigEdAkA

kadalanu kadalanu kadalanulE


caraNaM : 2
nI nallani vAljaDalO

virisina mallelu rammanenu

nI errani buggalapai siggulu

edurai pommanenu ||nallani||

nuvu lEkapOtE O celI

I lOkamaMtA cali cali

nuvu lEkapOtE O celI lOkamE cali

Emi cEsEnu eTula saicEnE

nI veccani kaugiTa odigEdAkA

viDuvanu viDuvanu viDuvanulE
 

Click here to hear the song
హాయ్ హాయ్ హాయ్

నా చెంప తాకగానే

చెలీ నీ చేయి

కందెనేమో

నా చూపు సోకగానే

అరెరె నాజూకు

తగ్గెనేమో

॥చెంప॥


నాపైన నీకు కోపమా

కాదేమి విరహతాపమా

నాపైన నీకు కోపమా

విరహతాపమా

పలుకగారాదా అలుక మరియాదా

నీ పదునౌ చూపుల అదిరింపులకు

బెదరను బెదరను బెదరనులే


పల్లవి :
దాచాలంటే దాగదులే

దాగుడుమూతలు సాగవులే

వలపుల సంకెల బిగిసేదాకా

వదలను వదలను వదలనులే


చరణం : 1 
నీ కులుకు నడక చూచి

రాజహంసలకు సిగ్గు కలిగె

నీ తళుకు మోము చూచి

నింగి జాబిలికి సిగ్గు తరిగె

కులుకు॥

అయ్యారే మేని అందము

బంగారు తీగ చందము

అయ్యారే మేని అందము

తీగ చందము

మరులుగొలిపేనూ మనసు దోచేనూ

ఈ కమ్మని రాతిరి కరిగేదాకా

కదలను కదలను కదలనులే


చరణం : 2
నీ నల్లని వాల్జడలో

విరిసిన మల్లెలు రమ్మనెను

నీ ఎర్రని బుగ్గలపై సిగ్గులు

ఎదురై పొమ్మనెను ॥నల్లని॥

నువు లేకపోతే ఓ చెలీ

ఈ లోకమంతా చలి చలి

నువు లేకపోతే ఓ చెలీ లోకమే చలి

ఏమి చేసేను ఎటుల సైచేనే

నీ వెచ్చని కౌగిట ఒదిగేదాకా

విడువను విడువను విడువనులే
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment