Monday, July 20, 2020

Lahiri lahiri lahiri lo » Ne gungello chudamma      లాహిరి లాహిరి లాహిరి లో » నీ గుండెల్లో చూడమ్మా

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Ne gungello chudamma / నీ గుండెల్లో చూడమ్మా
Song Details:Actor : Harikrishna / హరికృష్ణ  ,  Suman / సుమన్ ,  Vineeth / వినీత్ ,Actress : Ankitha / అంకిత ,  Bhanupriya / భాను ప్రియ ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Sonu Nigam / సోను నిగమ్ ,  Sunitha / సునీత ,Song Category : Others
pa/a: nEstamA ...O priya nEstamA...
priyatamA ..nAlO prANamA...
nIlO vunna nannE cUDanaMTU  paMtamA
teracATu dATi  daricErumA...  eDabATu dUraM 



karigiMcumA||nEstamA||
ca/a: nI guMDellO cUDammA nEnu  lEnA EmUlO
nI UpirilO vetukammA cErukunnA EnADO
manasiccAvu nAkE kadA adi vadilEsi pOtE elA
ekkaDunnA celI nI eda ninnu nAvaipu  naDipiMcadA
veLLEdArulannI nannu cUpE vELalO
kanumUsukuMTE kanipiMcanA
edalOni  pATai vinipiMcanA                 ||nEstamA||
ca/A: nA guMDellO I BAraM dATanaMdi IdUraM
nA UpirilO ImaunaM pADanaMdi priyagAnaM
anni telisunna anurAgamA nannu veMTADaTaM 



nyAyamA
reppa venakAla toli svapnamA uppunIrai ubiki rAkumA 
kammani jGApakaMlA UhAlO niduriMcumA
manasaMdukunna mamakAramA
marapiMcu varamai dIviMcumA
pa/A: nEstamA... Opriya nEstamA...
AgumA ... ASala vEgamA...
mAnani gAyamiMka rEputAvA  snEhamA
I  janmakiMtE manniMcumA
marujanma vuMTE nIdE sumA 
pa/a: nEstamA ...iddari madhya konni aDugula
dUraM uMdi , adi EDaDugulu avvAli
nI pErE palakamaMdi nI UsulE vinamaMdi
ninnE cUDamaMdi
nEstamA... Opriya  nEstamA...
 
 
Click here to hear the song
ప/అ: నేస్తమా ...ఓ ప్రియ నేస్తమా...
ప్రియతమా ..నాలో ప్రాణమా...
నీలో వున్న నన్నే చూడనంటూ  పంతమా
తెరచాటు దాటి  దరిచేరుమా...  ఎడబాటు దూరం కరిగించుమా||నేస్తమా||
చ/అ: నీ గుండెల్లో చూడమ్మా నేను  లేనా ఏమూలో
నీ ఊపిరిలో వెతుకమ్మా చేరుకున్నా ఏనాడో
మనసిచ్చావు నాకే కదా అది వదిలేసి పోతే ఎలా
ఎక్కడున్నా చెలీ నీ ఎద నిన్ను నావైపు  నడిపించదా
వెళ్ళేదారులన్నీ నన్ను చూపే వేళలో
కనుమూసుకుంటే కనిపించనా
ఎదలోని  పాటై వినిపించనా                 ||నేస్తమా||
చ/ఆ: నా గుండెల్లో ఈ భారం దాటనంది ఈదూరం
నా ఊపిరిలో ఈమౌనం పాడనంది ప్రియగానం
అన్ని తెలిసున్న అనురాగమా నన్ను వెంటాడటం న్యాయమా
రెప్ప వెనకాల తొలి స్వప్నమా ఉప్పునీరై ఉబికి రాకుమా 
కమ్మని జ్ఘాపకంలా ఊహాలో నిదురించుమా
మనసందుకున్న మమకారమా
మరపించు వరమై దీవించుమా
ప/ఆ: నేస్తమా... ఓప్రియ నేస్తమా...
ఆగుమా ... ఆశల వేగమా...
మానని గాయమింక రేపుతావా  స్నేహమా
ఈ  జన్మకింతే మన్నించుమా
మరుజన్మ వుంటే నీదే సుమా 
ప/అ: నేస్తమా ...ఇద్దరి మధ్య కొన్ని అడుగుల
దూరం ఉంది , అది ఏడడుగులు అవ్వాలి
నీ పేరే పలకమంది నీ ఊసులే వినమంది
నిన్నే చూడమంది
నేస్తమా... ఓప్రియ  నేస్తమా...
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment