Monday, July 20, 2020

Lahiri lahiri lahiri lo » Kami kani vaadu      లాహిరి లాహిరి లాహిరి లో » కామి కాని వాడు

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Kami kani vaadu / కామి కాని వాడు
Song Details:Actor : Harikrishna / హరికృష్ణ  ,  Suman / సుమన్ ,  Vineeth / వినీత్ ,Actress : Ankitha / అంకిత ,  Bhanupriya / భాను ప్రియ ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : M.M. Keeravani / ఎం.ఎం. కీరవాణి  ,Song Category : Others
sA/a. kAShAya vastrAla kamaMDala dhArI
mOkShAniki lEdayA aDDadAri
peLLicEsukuni plATu tIsukuni
AnaMdaMlO  aMtu  telusukuni
saMsArAnnE IdAlOy...  suKasArAnnE cATAlOy...
baMdumitra  parivAramutO ... bayaludEri pOdAM rArO...
mELatALAla  saMdaLLO... pAlu paMcukuMdAM rArO
pa/a: mana vIraveMkaTasatyannArAyaNa peLLi...
ci|| sau|| nAgaveMkaTa rattannakumAri tOTi...
prEma paMcAMgaM  tiragEsi vIlu unnamUrtaMcUsi...
ayinavALLaM aMtAvacci ... aMgaraMga vaiBOgaMgA..
peLLi cEsi OhO anipistAM...
koMgu muLLu vEsi dIvenlaMdistAM..    ||mana vIra veMkaTa||
ca/a: kAmi kAni vADu mOkShagAmigAnE kADurA...
kaLyANamaMTE lOka kaLyANamEnurA..
uTTE koTTaMdE... O.. sorgaM aMdEnA..
jaMTE kaTTaMdE.. I.. sRuShTE puTTEnA..
iMTi dIpaM veligiMci raMgula lOkaM cUpiMci
arthaBAgaM aMdiMci anaMta BAgyaM kaligiMci
brahmacAri koMpanu kAstA bommala koluvuga cEyiMci
kApuraMlO kailAsAnnE cUpiMcE illAlE kAvAlOy..
a: sO..        ||mana vIra veMkaTa||
kO: sauMdaryaM madagajagamanaM
sauMdaryaM varaGanajaGanaM
sauMdaryaM narasija nayanaM
sauMdaryaM madhumaya adharaM
sauMdaryaM surucira vadanaM
sauMdaryaM sumamaya nadanaM
ca/a: caMdamAma vastEgAni niMgi kaMdaM lEdurA
caitramAsaM vaccEdAkA tOTakarthaM lEdurA
vEsavigAlullO... hE.. mallela tApullA
tolakari cinukallO..  hAy.. maTTi sugaMdhaMlA
oMTaraina guMDellO jaMTa guvvai cErAli
brahmacAri kannullO BAmanavvulu velagAli
ammalAga lAliMcElA rANi lAga pAliMcElA
nEstamallE naDipiMcElA ceMtacErE tODE kAvAlOy..
A: sO..        ||mana vIra veMkaTa||
 
 
Click here to hear the song
సా/అ. కాషాయ వస్త్రాల కమండల ధారీ
మోక్షానికి లేదయా అడ్డదారి
పెళ్ళిచేసుకుని ప్లాటు తీసుకుని
ఆనందంలో  అంతు  తెలుసుకుని
సంసారాన్నే ఈదాలోయ్...  సుఖసారాన్నే చాటాలోయ్...
బందుమిత్ర  పరివారముతో ... బయలుదేరి పోదాం రారో...
మేళతాళాల  సందళ్ళో... పాలు పంచుకుందాం రారో
ప/అ: మన వీరవెంకటసత్యన్నారాయణ పెళ్ళి...
చి|| సౌ|| నాగవెంకట రత్తన్నకుమారి తోటి...
ప్రేమ పంచాంగం  తిరగేసి వీలు ఉన్నమూర్తంచూసి...
అయినవాళ్ళం అంతావచ్చి ... అంగరంగ వైభోగంగా..
పెళ్ళి చేసి ఓహో అనిపిస్తాం...
కొంగు ముళ్ళు వేసి దీవెన్లందిస్తాం..    ||మన వీర వెంకట||
చ/అ: కామి కాని వాడు మోక్షగామిగానే కాడురా...
కళ్యాణమంటే లోక కళ్యాణమేనురా..
ఉట్టే కొట్టందే... ఓ.. సొర్గం అందేనా..
జంటే కట్టందే.. ఈ.. సృష్టే పుట్టేనా..
ఇంటి దీపం వెలిగించి రంగుల లోకం చూపించి
అర్థభాగం అందించి అనంత భాగ్యం కలిగించి
బ్రహ్మచారి కొంపను కాస్తా బొమ్మల కొలువుగ చేయించి
కాపురంలో కైలాసాన్నే చూపించే ఇల్లాలే కావాలోయ్..
అ: సో..        ||మన వీర వెంకట||
కో: సౌందర్యం మదగజగమనం
సౌందర్యం వరఘనజఘనం
సౌందర్యం నరసిజ నయనం
సౌందర్యం మధుమయ అధరం
సౌందర్యం సురుచిర వదనం
సౌందర్యం సుమమయ నదనం
చ/అ: చందమామ వస్తేగాని నింగి కందం లేదురా
చైత్రమాసం వచ్చేదాకా తోటకర్థం లేదురా
వేసవిగాలుల్లో... హే.. మల్లెల తాపుల్లా
తొలకరి చినుకల్లో..  హాయ్.. మట్టి సుగంధంలా
ఒంటరైన గుండెల్లో జంట గువ్వై చేరాలి
బ్రహ్మచారి కన్నుల్లో భామనవ్వులు వెలగాలి
అమ్మలాగ లాలించేలా రాణి లాగ పాలించేలా
నేస్తమల్లే నడిపించేలా చెంతచేరే తోడే కావాలోయ్..
ఆ: సో..        ||మన వీర వెంకట||
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment