Tuesday, July 21, 2020

Kudirite Kappu Coffee » Srikaram      కుదిరితే కప్పు కాఫీ » శ్రీకారం

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Srikaram / శ్రీకారం

Song Details:Actor : Varun Sandhesh / వరుణ్ సందేశ్ ,Actress : Suma Bhattacharya / సుమ భట్టాచార్య ,Music Director : Yogeeswara Sarma / యోగీశ్వర శర్మ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Nihal / నిహాల్ ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi :

 SreekaaraM chuDutunnaTTu kammani kalanaahvaanistoo

 nee kanulaki choostunnaayae maakkooDaa choopiMchammaa

 rapaakaaraM kaDutunnaTTu raabOyae paMDa ga chuTToo

 nee guppiTa aedO guTTu daakkuMdae baMgarubommaa

IISreekaaraMII

 jala jala jala jaajula vaana kila kila kila kinnera veeNa

 mila mila minnaMchulapaina melidirigina cheMchala yaana

 madhurOhala laahirilOna madinoopae madirave jaaNa charaNaM : 1

 nee naDakalu neevaenaa chooSaavaa aenaaDainaa

 nee mettani aDugula kiMda paDi naligina praaNaalennO

 gamaniMchavu kaastai nee venakaalaemautunnaa

 nee veepunu muLlai guchchae kunukerugani choopulu ennO

 laasyaM puTTina ooru laavaNyaM peTTani teeru

 lalanaa telusO laedO neekainaa nee teeru

 neegaalai sOkinavaaru gaalib^ gajalaipOtaaru

 neemaenu taakinavaaru niluvellaa virulautaaru

 kavitavO yuvativO evativO gurtiMchaedeTTaagammaa charaNaM : 2

 nakshatraalennaMToo lekkaDitae aemainaTTu

 nee manasuku rekkalu kaTTu chukkallO vihariMchaeTTu

 ekkaDa naa velugaMToo eppuDu edurostuMdaMToo

 chikkaTi cheeka Tinae choostoo nidduranae velivaeyaddu

 vaekuvanae laakkochchaeTTu vennelatO daaraM kaTTu

 idigO vachchaanaMToo takshaNamae haajarayaeTTu

 aMdaakaa maaraammaani jOkoTTavae aaraaTaanni

 poMdiggaa paDukO raaNi jaagaaraM eMdukkaani

 naDimivO hariNivO taruNivO muripiMchae muddulagumma


 
 
Click here to hear the song
పల్లవి :

 శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలనాహ్వానిస్తూ

 నీ కనులకి చూస్తున్నాయే మాక్కూడా చూపించమ్మా

 రపాకారం కడుతున్నట్టు రాబోయే పండ గ చుట్టూ

 నీ గుప్పిట ఏదో గుట్టు దాక్కుందే బంగరుబొమ్మా

 ॥శ్రీకారం॥

 జల జల జల జాజుల వాన కిల కిల కిల కిన్నెర వీణ

 మిల మిల మిన్నంచులపైన మెలిదిరిగిన చెంచల యాన

 మధురోహల లాహిరిలోన మదినూపే మదిరవె జాణ చరణం : 1

 నీ నడకలు నీవేనా చూశావా ఏనాడైనా

 నీ మెత్తని అడుగుల కింద పడి నలిగిన ప్రాణాలెన్నో

 గమనించవు కాస్తై నీ వెనకాలేమౌతున్నా

 నీ వీపును ముళ్లై గుచ్చే కునుకెరుగని చూపులు ఎన్నో

 లాస్యం పుట్టిన ఊరు లావణ్యం పెట్టని తీరు

 లలనా తెలుసో లేదో నీకైనా నీ తీరు

 నీగాలై సోకినవారు గాలిబ్ గజలైపోతారు

 నీమేను తాకినవారు నిలువెల్లా విరులౌతారు

 కవితవో యువతివో ఎవతివో గుర్తించేదెట్టాగమ్మా చరణం : 2

 నక్షత్రాలెన్నంటూ లెక్కడితే ఏమైనట్టు

 నీ మనసుకు రెక్కలు కట్టు చుక్కల్లో విహరించేట్టు

 ఎక్కడ నా వెలుగంటూ ఎప్పుడు ఎదురొస్తుందంటూ

 చిక్కటి చీక టినే చూస్తూ నిద్దురనే వెలివేయద్దు

 వేకువనే లాక్కొచ్చేట్టు వెన్నెలతో దారం కట్టు

 ఇదిగో వచ్చానంటూ తక్షణమే హాజరయేట్టు

 అందాకా మారామ్మాని జోకొట్టవే ఆరాటాన్ని

 పొందిగ్గా పడుకో రాణి జాగారం ఎందుక్కాని

 నడిమివో హరిణివో తరుణివో మురిపించే ముద్దులగుమ్మ
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment