Tuesday, July 21, 2020

Kothabangaru Lokam » Ok Anesa      కొత్త బంగారు లోకం » ఓకే అనేశా

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Ok Anesa / ఓకే అనేశా

Song Details:Actor : Varun Sandhesh / వరుణ్ సందేశ్ ,Actress : Swetha Basu / శ్వేతా బసు ,Music Director : Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Kalyaani Menon / కళ్యాణి మీనన్ ,  Naresh Iyer / నరేష్ అయ్యర్  ,Song Category : Love & Romantic Songs
OkE anEshaa dEKO naa bharOsaa
nIkE vadilEshaa naakeMdukulE rabhasaa
OkE anEshaa dEKO naa bharOsaa
nIkE vadilEshaa naakeMdukulE rabhasaa
bhaaramaMtaa nEnu mOstaa allukO aashaalata
cEradIstaa sEva cEstaa raaNilaa cUstaa
aMdukEgaa guMDelO nI pEru raashaa
telivanukO teguvanukO maga janma kadaa
katha modalanukO tudi varaku nilabaDagaladaa
OkE anEshaa dEKO naa bharOsaa
nIkE vadilEshaa naakeMdukulE rabhasaa
OkE anEshaa dEKO naa bharOsaa
nIkE vadilEshaa naakeMdukulE rabhasaa



parigeDadaaM padavE celI - eMdaakaa annaanaa
kanipeDadaaM tudi majilI -ekkaDunnaaM
egireLadaaM ilanodili - evaraapinaa
marO saari anu aa maaTa mahaaraajunaipOtaagaa
prati nimiShaM nI kOsaM 
praaNaM saitaM paMdeM vEsEstaa
paata RuNamO kotta varamO
janma muDi vEsiMdilaa
cilipi tanamO celimi guNamO EmiTI lIla
swapna lOkaM ElukuMdaaM raagamaalaa
adigadigO madikedurai kanabaDalEdaa
katha modalanukO tudi varaku  nilabaDagaladaa



pilicinadaa cilipi kala- viMTUnE vaccEshaa
tariminadaa celiyanidaa - parugutIshaa
vadilinadaa biDiyamilaa - prashnalni ceripEshaa
eduravadaa cikku vala - eTO cUshaa
bhalEguMdilE nI dhImaa bharistuMdilE I prEma
adarakumaa bedarakumaa
paradaa viDiraa saradaapaDadaamaa
pakkanuMTE PakkumaMTU navvinaaDaa priyatamaa
cikkuluMTE bikkumaMTU lekka cEstaamaa
cukkalannI cinnabOvaa cakkanammaa
mamatanukO magatanukO mati ceDipOdaa
katha modalanukO tudi varaku nilabaDagaladaa
 
Click here to hear the song
ఓకే అనేశా దేఖో నా భరోసా
నీకే వదిలేశా నాకెందుకులే రభసా
ఓకే అనేశా దేఖో నా భరోసా
నీకే వదిలేశా నాకెందుకులే రభసా
భారమంతా నేను మోస్తా అల్లుకో ఆశాలత
చేరదీస్తా సేవ చేస్తా రాణిలా చూస్తా
అందుకేగా గుండెలో నీ పేరు రాశా
తెలివనుకో తెగువనుకో మగ జన్మ కదా
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా
ఓకే అనేశా దేఖో నా భరోసా
నీకే వదిలేశా నాకెందుకులే రభసా
ఓకే అనేశా దేఖో నా భరోసా
నీకే వదిలేశా నాకెందుకులే రభసా



పరిగెడదాం పదవే చెలీ - ఎందాకా అన్నానా
కనిపెడదాం తుది మజిలీ -ఎక్కడున్నాం
ఎగిరెళదాం ఇలనొదిలి - ఎవరాపినా
మరో సారి అను ఆ మాట మహారాజునైపోతాగా
ప్రతి నిమిషం నీ కోసం 
ప్రాణం సైతం పందెం వేసేస్తా
పాత ఋణమో కొత్త వరమో
జన్మ ముడి వేసిందిలా
చిలిపి తనమో చెలిమి గుణమో ఏమిటీ లీల
స్వప్న లోకం ఏలుకుందాం రాగమాలా
అదిగదిగో మదికెదురై కనబడలేదా
కథ మొదలనుకో తుది వరకు  నిలబడగలదా



పిలిచినదా చిలిపి కల- వింటూనే వచ్చేశా
తరిమినదా చెలియనిదా - పరుగుతీశా
వదిలినదా బిడియమిలా - ప్రశ్నల్ని చెరిపేశా
ఎదురవదా చిక్కు వల - ఎటో చూశా
భలేగుందిలే నీ ధీమా భరిస్తుందిలే ఈ ప్రేమ
అదరకుమా బెదరకుమా
పరదా విడిరా సరదాపడదామా
పక్కనుంటే ఫక్కుమంటూ నవ్వినాడా ప్రియతమా
చిక్కులుంటే బిక్కుమంటూ లెక్క చేస్తామా
చుక్కలన్నీ చిన్నబోవా చక్కనమ్మా
మమతనుకో మగతనుకో మతి చెడిపోదా
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment