Monday, July 20, 2020

Kothabangaru Lokam » Nee Prashnalu      కొత్త బంగారు లోకం » నీ ప్రశ్నలు

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Nee Prashnalu / నీ ప్రశ్నలు

Song Details:Actor : Varun Sandhesh / వరుణ్ సందేశ్ ,Actress : Swetha Basu / శ్వేతా బసు ,Music Director : Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Inspiring & Motivational Songs
nI prashnalu nIvE evvarO badulivvarugaa
nI cikkulu nIvE evvarU viDipiMcarugaa
E gaalO ninnu tarumutuMTE allarigaa
aagaalO lEdO teliyadaMTE celladugaa
padi nelalu tanalO ninnu mOsina ammainaa
apuDO ipuDO kananE kananu aMTuMdaa
prati kusumaM tanadE anadE virisE kommainaa
guDikO jaDakO saaganaMpaka uMTuMdaa
batukaMTE baDi caduvaa anukuMTE ati suluvaa
porabaDinaa paDinaa jaalipaDadE kaalaM manalaagaa
oka nimiShaM kUDaa aagipOdE nuvvoccEdaakaa



alaluMDani kaDalEdani aDigEMdukE telivuMdaa
kalaluMDani kanulEvani nityaM nidarOmaMdaa
gatamuMdani gamaniMcani naDirEyiki rEpuMdaa
gati tOcani gamanaaniki gamyaM aMTU uMdaa
valapEdO vala vEsiMdi vayasEmO aTu tOsuMdi
gelupaMTE EdO iMta varaku vivariMcE RujuvEmuMdi
suDilO paDu prati naava cebutunnadi vinalEvaa



porabaaTuna cEjaarina taruNaM tirigostuMdaa
prati pUTOka puTagaa tana paaThaM vivaristuMdaa
mana kOsamE tanalO tanu ragilE ravi tapanaMtaa
kanumUsina taruvaatanE penu cIkaTi cebutuMdaa
kaDa tErani payanaalenni paDadOsina prayaaNaalenni
ani tirigEshaayaa carita puTalu venujUDaka urikE vetalu
tama muMdu taraalaku smRutula citulu aMdiMcaala prEmikulu
idi kaadE vidhi raata anukOdEM edurIta



padi nelalu tanalO ninnu mOsina ammainaa
apuDO ipuDO kananE kananu aMTuMdaa
prati kusumaM tanadE anadE virisE kommainaa
guDikO jaDakO saaganaMpaka uMTuMdaa
batukaMTE baDi caduvaa anukuMTE ati suluvaa
porabaDinaa paDinaa jaalipaDadE kaalaM manalaagaa
oka nimiShaM kUDaa aagipOdE nuvvoccEdaakaa
 
Click here to hear the song
నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా



అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా
వలపేదో వల వేసింది వయసేమో అటు తోసుంది
గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే ఋజువేముంది
సుడిలో పడు ప్రతి నావ చెబుతున్నది వినలేవా



పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతి పూటోక పుటగా తన పాఠం వివరిస్తుందా
మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా
కడ తేరని పయనాలెన్ని పడదోసిన ప్రయాణాలెన్ని
అని తిరిగేశాయా చరిత పుటలు వెనుజూడక ఉరికే వెతలు
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాల ప్రేమికులు
ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత



పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment