Tuesday, July 21, 2020

Kondaveeti Donga » Shubhalekha      కొండవీటి దొంగ » శుభలేఖ

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Shubhalekha / శుభలేఖ
Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Radha / రాధ ,  Vijayashanthi / విజయశాంతి ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Comedy Songs
shubhalEKa raasukunna edalO epuDO..

 adi mIku paMpukunna apuDE kalalO..

 puShyami puvvula pUja cEstaa buggana cukkalatO..

 ottiDi valapula gaMdhamistaa..pakkalalO!!



 shubhalEKa aMdukunnaa kalayO nijamO..

 tolimuddu jaabu raashaa celikE eppuDO..

 shaarada mallela pUlajallE vennela navvulalO

 shraavaNa saMdyanu raMgaristaa kannulatO!!



 shubhalEKa raasukunna edalO epuDO..

 tolimuddu jaabu raashaa celikE eppuDO!!



 caitramaasamoccenEmO citramaina prEmaki??

 kOyilamma kUsenEmO goMtunicci kommaki..



 mattugaali vIcenEmO maayadaari cUpuki..

 mallemabbu laaDenEmO baalanIlavENiki!!



 mecci mecci cUDasaagE guccE kannulu..

 gucci gucci kaugiliMcE naccE vannelu..

 aMtElE, katha aMtElE, adaMtElE!!



 shubhalEKa aMdukunnaa kalayO nijamO..

 tolimuddu jaabu raashaa celikE eppuDO..

 puShyami puvvula pUja cEstaa buggana cukkalatO..

 ottiDi valapula gaMdhamistaa..pakkalalO!!



 shubhalEKa aMdukunnaa kalayO nijamO..

 shubhalEKa raasukunna edalO epuDO..



 haMsalEKa paMpalEka hiMsa paDDa prEmaki..

 prEmalEKa raasukunnaa pedavi raani maaTatO..



 raadhalaaga mUgabOyaa ponna ceTTu nIDalO..

 vEsavalle vEcivunnaa vENupUla tOTalO!!



 vaalucUpu mOsukoccE ennO vaartalu..

 oLLO daaTi veLLa saagEennO vaaMCalu..



 aMtElE, katha aMtElE, adaMtElE!!



 shubhalEKa raasukunna edalO epuDO..

 adi mIku paMpukunna apuDE kalalO..

 shaarada mallela pUlajallE vennela navvulalO

 shraavaNa saMdyanu raMgaristaa kannulatO!!



 shubhalEKa raasukunna edalO epuDO..

 shubhalEKa aMdukunnaa kalayO nijamO..




Click here to hear the song
శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో..

అది మీకు పంపుకున్న అపుడే కలలో..

పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో..

ఒత్తిడి వలపుల గంధమిస్తా..పక్కలలో!!



శుభలేఖ అందుకున్నా కలయో నిజమో..

తొలిముద్దు జాబు రాశా చెలికే ఎప్పుడో..

శారద మల్లెల పూలజల్లే వెన్నెల నవ్వులలో

శ్రావణ సంద్యను రంగరిస్తా కన్నులతో!!



శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో..

తొలిముద్దు జాబు రాశా చెలికే ఎప్పుడో!!



చైత్రమాసమొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి??

కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి..



మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి..

మల్లెమబ్బు లాడెనేమో బాలనీలవేణికి!!



మెచ్చి మెచ్చి చూడసాగే గుచ్చే కన్నులు..

గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు..

అంతేలే, కథ అంతేలే, అదంతేలే!!



శుభలేఖ అందుకున్నా కలయో నిజమో..

తొలిముద్దు జాబు రాశా చెలికే ఎప్పుడో..

పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో..

ఒత్తిడి వలపుల గంధమిస్తా..పక్కలలో!!



శుభలేఖ అందుకున్నా కలయో నిజమో..

శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో..



హంసలేఖ పంపలేక హింస పడ్డ ప్రేమకి..

ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో..



రాధలాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో..

వేసవల్లె వేచివున్నా వేణుపూల తోటలో!!



వాలుచూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు..

ఒళ్ళో దాటి వెళ్ళ సాగేఎన్నో వాంఛలు..



అంతేలే, కథ అంతేలే, అదంతేలే!!



శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో..

అది మీకు పంపుకున్న అపుడే కలలో..

శారద మల్లెల పూలజల్లే వెన్నెల నవ్వులలో

శ్రావణ సంద్యను రంగరిస్తా కన్నులతో!!



శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో..

శుభలేఖ అందుకున్నా కలయో నిజమో..
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment