Friday, July 24, 2020

Kodalu Diddhina Kapuram » Nee Dharmam      కోడలు దిద్దిన కాపురం » నీ ధర్మం

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Nee Dharmam / నీ ధర్మం

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Patriotic Songs
nI dharmaM nI saMGaM nI dEshaM nuvu maravaddu
jaatini naDipi nItini nilipina mahanIyulanE maravaddu



satyaM kOsaM satinE amminadevaru - harishcaMdruDu
taMDri maaTakai kaanalakEginadevaru - shrI raamacaMdruDu
anna sEvakE aMkitamainadevaranna - lakShmanna
patiyE daivamani tariMcipOyinadevarammaa - sItamma
aa puNya mUrtulu cUpina maargaM anusariMcuTE dharmaM
anusariMcuTE  nI dharmaM



nI dharmaM  maravaddu
jaatini naDipi nItini nilipina mahanIyulanE maravaddu



caapa kUDutO samatanu nErpenu naaTi palanaaTi brahmanna
mEDi paMDulaa merisE saMgaM guTTuvippenu vEmanna
vitaMtula vidhi vraatalu maarci bratukulu paMDiMcE kaMdukUri
telugu bhaaratini prajalabhaaShalO tIricididdenu gurajaaDa
aa saMskartala aashayaraMgaM nIvu nilicina saMGaM



nI saMGaM maravaddu
jaatini naDipi nItini nilipina mahanIyulanE maravaddu



swataMtrabhaarata rathasaaradhiyai samaraana dUke nEtaajI
satyaagrahamE saadhanammugaa swaraajyamE teccE baapUjI
guMDekedurugaa guMDe nilipenu aaMdhrakEsari TaMguTUri
teluguvaarikoka raaShTraM kOri aahuti aayenu amarajIvi
aa dEsha bhaktulu velasina dEshaM nIvu puTTina bhaaratadEshaM
nIvu puTTina I dEshaM



nI dharmaM nI saMGaM nI dEshaM nuvu maravaddu
jaatini naDipi nItini nilipina mahanIyulanE maravaddu
 
 
Click here to hear the song
నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు



సత్యం కోసం సతినే అమ్మినదెవరు - హరిశ్చంద్రుడు
తండ్రి మాటకై కానలకేగినదెవరు - శ్రీ రామచంద్రుడు
అన్న సేవకే అంకితమైనదెవరన్న - లక్ష్మన్న
పతియే దైవమని తరించిపోయినదెవరమ్మా - సీతమ్మ
ఆ పుణ్య మూర్తులు చూపిన మార్గం అనుసరించుటే ధర్మం
అనుసరించుటే  నీ ధర్మం



నీ ధర్మం  మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు



చాప కూడుతో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న
మేడి పండులా మెరిసే సంఘం గుట్టువిప్పెను వేమన్న
వితంతుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించే కందుకూరి
తెలుగు భారతిని ప్రజలభాషలో తీరిచిదిద్దెను గురజాడ
ఆ సంస్కర్తల ఆశయరంగం నీవు నిలిచిన సంఘం



నీ సంఘం మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు



స్వతంత్రభారత రథసారధియై సమరాన దూకె నేతాజీ
సత్యాగ్రహమే సాధనమ్ముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ
గుండుకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి
తెలుగువారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయెను అమరజీవి
ఆ దేశ భక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం
నీవు పుట్టిన ఈ దేశం



నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment