Monday, July 20, 2020

Khadgam » Nuvvu...Nuvvu...      ఖడ్గం » నువ్వు...నువ్వు...

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Nuvvu...Nuvvu... / నువ్వు...నువ్వు...
Song Details:Actor : Srikanth / శ్రీకాంత్ ,Actress : Sonali Bendre / సొనాలీ బింద్రె ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Sumangali / సుమంగళి ,Song Category : Others
pa: nuvvu...nuvvu...nuvvu nuvvu, nuvvu...nuvvu ...nuvvu....

nuvvu...nuvvu..nuvvu,nuvvu.....nuvvu...nuvvu...nuvvu...

nAlOnE nuvvu nAtOnEnuvvu nA cuTTU nuvvu nEnaMtA nuvvu

nApedavipaina nuvvu nA meDavaMpuna nuvvu

nA guMDe mIda nA oLlaMtA nuvvu

buggallO nuvvU... meggallE nuvvu...muddEsE nuvvU

niddarlO nuvvU... poddullO nuvvu pratinimuShaM nuvvU         ||nuvvu||

ca: nA vayasunu vEdhiMcE veccadanaM nuvvu

nA manasunu lAliMcE calladanaM nuvvu

paiTE baruvanipiMcE paccidanaM nuvvu

baiTa  paDAlanipiMcE  piccidanaM  nuvvu

nAprati yuddaM nuvvU nA sainyaM nuvvu

nApriya Satruvu nuvvU....nuvvU....

mettani mallai gille tolicinukE nuvvu

naccE kaShTaM nuvvU... nuvvU...       ||nuvvu||

ca: nA siggunu dAcukunE kaugilivE  nuvvu

nA vannI dOcukunE kOrikavE nuvvu

muni paMTitO nanu giccE nErAnivi nuvvu

nA naDumunu naDipiMcE nEstAnivi nuvvu

tIraM dAhaM nuvvu nA mOhaM nuvvu

tappani snEhaM nuvvU....nuvvU....

tIyani gAyaM cEsE anyAyaM nuvvu

ayinA iShTaM nuvvU...nuvvU....                  ||nuvvu||

maimaripistU nuvvu muripistuMTE nuvvu

nE kOrukunE nA marOjanma nuvvu

kaipekkistU nuvvu kavvistuMTE nuvvu

nAkE teliyani nA kottapEru nuvvu

nA aMdaM nuvvu AnaMdaM nuvvu

nEnaMTE nuvvU....

nA paMtaM nuvvu....nA soMtaM nuvvu

nA aMtaM nuvvU...                               ||nuvvu||


 
Click here to hear the song
ప: నువ్వు...నువ్వు...నువ్వు నువ్వు, నువ్వు...నువ్వు ...నువ్వు....

నువ్వు...నువ్వు..నువ్వు,నువ్వు.....నువ్వు...నువ్వు...నువ్వు...

నాలోనే నువ్వు నాతోనేనువ్వు నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు

నాపెదవిపైన నువ్వు నా మెడవంపున నువ్వు

నా గుండె మీద నా ఒళ్లంతా నువ్వు

బుగ్గల్లో నువ్వూ... మెగ్గల్లే నువ్వు...ముద్దేసే నువ్వూ

నిద్దర్లో నువ్వూ... పొద్దుల్లో నువ్వు ప్రతినిముషం నువ్వూ         ||నువ్వు||

చ: నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు

నా మనసును లాలించే చల్లదనం నువ్వు

పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు

బైట  పడాలనిపించే  పిచ్చిదనం  నువ్వు

నాప్రతి యుద్దం నువ్వూ నా సైన్యం నువ్వు

నాప్రియ శత్రువు నువ్వూ....నువ్వూ....

మెత్తని మల్లై గిల్లె తొలిచినుకే నువ్వు

నచ్చే కష్టం నువ్వూ... నువ్వూ...       ||నువ్వు||

చ: నా సిగ్గును దాచుకునే కౌగిలివే  నువ్వు

నా వన్నీ దోచుకునే కోరికవే నువ్వు

ముని పంటితో నను గిచ్చే నేరానివి నువ్వు

నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు

తీరం దాహం నువ్వు నా మోహం నువ్వు

తప్పని స్నేహం నువ్వూ....నువ్వూ....

తీయని గాయం చేసే అన్యాయం నువ్వు

అయినా ఇష్టం నువ్వూ...నువ్వూ....                  ||నువ్వు||

మైమరిపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు

నే కోరుకునే నా మరోజన్మ నువ్వు

కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు

నాకే తెలియని నా కొత్తపేరు నువ్వు

నా అందం నువ్వు ఆనందం నువ్వు

నేనంటే నువ్వూ....

నా పంతం నువ్వు....నా సొంతం నువ్వు

నా అంతం నువ్వూ...                               ||నువ్వు||




 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment