Tuesday, July 21, 2020

Khadgam » Musugu Veyyaddu      ఖడ్గం » ముసుగు వెయ్యద్దు

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Musugu Veyyaddu / ముసుగు వెయ్యద్దు
Song Details:Actor : Srikanth / శ్రీకాంత్ ,Actress : Sonali Bendre / సొనాలీ బింద్రె ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Kalpana / కల్పన ,Song Category : Others
pa: musugu veyyaddu , manasu mIda

valalu veyyaddu vayasumIda(2)

egaranivvali kurrALlarekkalni tuPAnu vEgAlatO

evaDi AnaMdaM vADidaMTE oppukOlErA

anuBaviMcaMde teliyadaMTe tapu aMTArA

manasu ceppiMde manaku vEdaM kAdanE vAre lErugA

manaku tOciMdE cEsi cUddAM evaDu EmaMTe EMTirA   ||manasu||

ca: sUryuDainA cUpagalaDA reyicATunna rEpuni

cIkaTainA ApagalaDA vaccEkalalni vaddanI

piriki paradA kappagaladA urakalEstunna ASani

dEvuDainA ceppagalaDA samasyalanEvi rAvanI

annO aMdAlu svAgatistU kaLlamuMduMDagA

aMdukOkuMDA AgipOtU usUru maMTE^^elA

I uDukU I duDukU I venakki tiragani parugu

uMDadugA kaDavarakU I vayassunilAge karigipOnIku           ||manasu||

ca: koMtakAlaM nElakoccAM atidhulai vuMDi veLlagA

kOTalainA koMpalainA EvI sdhirAsdhi kAdugA

kAsta snEhaM kAsta sahanaM paMcukOvaccu hAyigA

aMtakannA soMtamaMTU      prapaMca paTaMlO ledurA

ninna lEvainA gurutukostE tIpi anipiMcanI

unnakonnALLu guMDeniMDA saradAlu paMDiMcanI

nIvevarO  nEnevarO^^O kShaNAna kalasi naDuddAM

sAvAsaM saMtOShaM ivi aMdiMci aMdarlO navvu niMpudAM            ||manasu||


 
Click here to hear the song
ప: ముసుగు వెయ్యద్దు , మనసు మీద

వలలు వెయ్యద్దు వయసుమీద(౨)

ఎగరనివ్వలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో

ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా

అనుభవించందె తెలియదంటె తపు అంటారా

మనసు చెప్పిందె మనకు వేదం కాదనే వారె లేరుగా

మనకు తోచిందే చేసి చూద్దాం ఎవడు ఏమంటె ఏంటిరా   ||మనసు||

చ: సూర్యుడైనా చూపగలడా రెయిచాటున్న రేపుని

చీకటైనా ఆపగలడా వచ్చేకలల్ని వద్దనీ

పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశని

దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ

అన్నో అందాలు స్వాగతిస్తూ కళ్లముందుండగా

అందుకోకుండా ఆగిపోతూ ఉసూరు మంటేఎలా

ఈ ఉడుకూ ఈ దుడుకూ ఈ వెనక్కి తిరగని పరుగు

ఉండదుగా కడవరకూ ఈ వయస్సునిలాగె కరిగిపోనీకు           ||మనసు||

చ: కొంతకాలం నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా

కోటలైనా కొంపలైనా ఏవీ స్ధిరాస్ధి కాదుగా

కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా

అంతకన్నా సొంతమంటూ      ప్రపంచ పటంలో లేదురా

నిన్న లేవైనా గురుతుకొస్తే తీపి అనిపించనీ

ఉన్నకొన్నాళ్ళు గుండెనిండా సరదాలు పండించనీ

నీవెవరో  నేనెవరో ఓ క్షణాన కలసి నడుద్దాం

సావాసం సంతోషం ఇవి అందించి అందర్లో నవ్వు నింపుదాం            ||మనసు||


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment