Monday, July 20, 2020

Khadgam » Khadgam...Khadgam...      ఖడ్గం » ఖడ్గం....ఖడ్గం..

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Khadgam...Khadgam... / ఖడ్గం....ఖడ్గం..
Song Details:Actor : Srikanth / శ్రీకాంత్ ,Actress : Sonali Bendre / సొనాలీ బింద్రె ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Others
KaDgaM....KaDgaM....KaDgaM.....KaDgaM.

OM kAranAdaMto aMkuriMcina vEda dhAtriki saMkEtaM I KaDgaM.

hrIMkAra nAdaMlO saMcariMcE AdiSaktiki  AkAraM I KaDgaM.

taratarAlugA kadalivaccina carita I KaDgaM.

yugayugAluga gamanamAgani Ganata I KaDgaM.

tanakaLlamuMdennisAmrAjya SaKarAlu mannupAlainA

kShaNamai tanagAdha gatamulO viDici mRuti^^oDi cEranidI KaDgaM.

pUTakO paDamaranu dATi pUrvadripai nitya praBAtamai velugutunnadI KaDgaM.(2)

mUDuvannela kEtanamugA miMTiki egasi kAlAniki edurEgu yaSOrASi I KaDgaM.

harini dharapai avatariMciga gelucukoccina Bakti KaDgaM.

narulOni daivAMSamE arSiMci kolicina muktimArgaM

ArtarakShakai dhariMcina dhIraguNamIKaDgaM.

dhUrta SikShaNakai vahiMcina karukutanamI KaDgaM.

huMkariMci ahaMkariMci atikramiMcina AkatAyula

aMtucUsina kShAtrastatvaM astamiMcani arka KaDgaM.

SaraNukOri SirassuvaMci samASrayiMcina annijAtula

poduvukunna udAratatvaM jagapatimaruvani dharmaKaDgaM.

nidduramattunu vadiliMcE keMjAyula jilugI KaDgaM.

cikkaTi cIkaTi cIlcukuvaccE tellani velugI KaDgaM.

maTTini cIlcuku ciguriMcE siripaccani cigurI KaDgaM.

keMjAyala  jilugI KaDgaM....telatellani velugI KaDgaM....siripaccani cigurI KaDgaM




 
Click here to hear the song
ఖడ్గం....ఖడ్గం....ఖడ్గం.....ఖడ్గం.

ఓం కారనాదంతొ అంకురించిన వేద ధాత్రికి సంకేతం ఈ ఖడ్గం.

హ్రీంకార నాదంలో సంచరించే ఆదిశక్తికి  ఆకారం ఈ ఖడ్గం.

తరతరాలుగా కదలివచ్చిన చరిత ఈ ఖడ్గం.

యుగయుగాలుగ గమనమాగని ఘనత ఈ ఖడ్గం.

తనకళ్లముందెన్నిసామ్రాజ్య శఖరాలు మన్నుపాలైనా

క్షణమై తనగాధ గతములో విడిచి మృతిఒడి చేరనిదీ ఖడ్గం.

పూటకో పడమరను దాటి పూర్వద్రిపై నిత్య ప్రభాతమై వెలుగుతున్నదీ ఖడ్గం.(2)

మూడువన్నెల కేతనముగా మింటికి ఎగసి కాలానికి ఎదురేగు యశోరాశి ఈ ఖడ్గం.

హరిని ధరపై అవతరించిగ గెలుచుకొచ్చిన భక్తి ఖడ్గం.

నరులోని దైవాంశమే అర్శించి కొలిచిన ముక్తిమార్గం

ఆర్తరక్షకై ధరించిన ధీరగుణమీఖడ్గం.

ధూర్త శిక్షణకై వహించిన కరుకుతనమీ ఖడ్గం.

హుంకరించి అహంకరించి అతిక్రమించిన ఆకతాయుల

అంతుచూసిన క్షాత్రస్తత్వం అస్తమించని అర్క ఖడ్గం.

శరణుకోరి శిరస్సువంచి సమాశ్రయించిన అన్నిజాతుల

పొదువుకున్న ఉదారతత్వం జగపతిమరువని ధర్మఖడ్గం.

నిద్దురమత్తును వదిలించే కెంజాయుల జిలుగీ ఖడ్గం.

చిక్కటి చీకటి చీల్చుకువచ్చే తెల్లని వెలుగీ ఖడ్గం.

మట్టిని చీల్చుకు చిగురించే సిరిపచ్చని చిగురీ ఖడ్గం.

కెంజాయల  జిలుగీ ఖడ్గం....తెలతెల్లని వెలుగీ ఖడ్గం....సిరిపచ్చని చిగురీ ఖడ్గం


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment