Song » Veena naadi Teega nedi / వీణ నాది తీగ నీది
Song Details:Actor :
Krishnam Raju / కృష్ణం రాజు ,Actress :
Jayasudha / జయసుధ ,Music Director :
J.V.Raghavulu / జె.వి.రాఘవులు ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi : aa... aa... aa... aa... aa..... veeNa naadi teega needi teegachaaTu raagamuMdi poovu naadi poota needi aakuchaaTu aMdamuMdi veeNa naadi teega needi teegachaaTu raagamuMdi teegachaaTu raagamuMdi... oo@M... oo@M.... charaNaM : 1 tolipoddu muddaaDagaanae erupekkae toorupu dikku tolichoopulaaTaaDagaanae valapokkaTae vayasu dikku varadallae vaaTaesi manasallae maaTaesi vayasallae kaaTaestae chikku... teepi muddichchi teerchaali mokku... IIveeNaII charaNaM : 2 mabbullO merupallae kaadu valapu vaana kurisi velisipOdu manasaMTae maaTalu kaadu adi maaTa istae marichipOdu bratukallae jatagooDi valapallae onagooDi oDilOnae guDikaTTae dikku... naa guDi deepamai naaku dakku... IIveeNaII Click here to hear the song
పల్లవి : ఆ... ఆ... ఆ... ఆ... ఆ..... వీణ నాది తీగ నీది తీగచాటు రాగముంది పూవు నాది పూత నీది ఆకుచాటు అందముంది వీణ నాది తీగ నీది తీగచాటు రాగముంది తీగచాటు రాగముంది... ఊఁ... ఊఁ.... చరణం : 1 తొలిపొద్దు ముద్దాడగానే ఎరుపెక్కే తూరుపు దిక్కు తొలిచూపులాటాడగానే వలపొక్కటే వయసు దిక్కు వరదల్లే వాటేసి మనసల్లే మాటేసి వయసల్లే కాటేస్తే చిక్కు... తీపి ముద్దిచ్చి తీర్చాలి మొక్కు... ॥వీణ॥ చరణం : 2 మబ్బుల్లో మెరుపల్లే కాదు వలపు వాన కురిసి వెలిసిపోదు మనసంటే మాటలు కాదు అది మాట ఇస్తే మరిచిపోదు బ్రతుకల్లే జతగూడి వలపల్లే ఒనగూడి ఒడిలోనే గుడికట్టే దిక్కు... నా గుడి దీపమై నాకు దక్కు... ॥వీణ॥ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment