Song » Oho Chelee.. / ఓహో చెలీ...
Song Details:Actor :
Narasimha Raju / నరసింహ రాజు ,Actress :
Srividya / శ్రీ విద్య ,Music Director :
S.P. Balasubrahmanyam / యస్.పి. బాలసుబ్రహ్మణ్యం ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi : OhO chelee... O... naa chelee... idi tolipaaTa oka chelipaaTa vinipiMchanaa ee pooTa aa paaTa IIidiII charaNaM : 1 eduTa neevu edalO neevu edigi odigi naatO uMTae maaTalannee paaTalai madhuvuloluku mamatae paaTa neeli neeli nee kannulalO neeDalaina naa kavitalalO nee challani charaNaalae nilupukunna valapee paaTa parimaLiMchu aa baMdhaalae paravaSiMchi paaDanaa paaDanaa paaDanaa IIOhO cheleeII charaNaM : 2 cheekaTilO vaakiTa nilichi dOsiTa sirimallelu kolichi nidurakaachi neekai vaechi niluvellaa kavitalu chaesi kadali kadali neevostuMTae kaDali poMgulanipistuMTae vennelanai neelO alanai nee velluvakae vaeNuvunai porali poMgu nee aMdaalae paravaSiMchi paaDanaa paaDanaa paaDanaa IIOhO cheleeII
పల్లవి : ఓహో చెలీ... ఓ... నా చెలీ... ఇది తొలిపాట ఒక చెలిపాట వినిపించనా ఈ పూట ఆ పాట ॥ఇది॥ చరణం : 1 ఎదుట నీవు ఎదలో నీవు ఎదిగి ఒదిగి నాతో ఉంటే మాటలన్నీ పాటలై మధువులొలుకు మమతే పాట నీలి నీలి నీ కన్నులలో నీడలైన నా కవితలలో నీ చల్లని చరణాలే నిలుపుకున్న వలపీ పాట పరిమళించు ఆ బంధాలే పరవశించి పాడనా పాడనా పాడనా ॥ఓహో చెలీ॥ చరణం : 2 చీకటిలో వాకిట నిలిచి దోసిట సిరిమల్లెలు కొలిచి నిదురకాచి నీకై వేచి నిలువెల్లా కవితలు చేసి కదలి కదలి నీవొస్తుంటే కడలి పొంగులనిపిస్తుంటే వెన్నెలనై నీలో అలనై నీ వెల్లువకే వేణువునై పొరలి పొంగు నీ అందాలే పరవశించి పాడనా పాడనా పాడనా ॥ఓహో చెలీ॥
0 comments:
Post a Comment