Monday, July 20, 2020

Kanche » Itu Itu Itu ani      కంచె » ఇటు ఇటు ఇటు అని

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Itu Itu Itu ani / ఇటు ఇటు ఇటు అని

Song Details:Actor : Varun tej / వరుణ్ తేజ్  ,Actress : Pragya Jaisval / ప్రగ్యా జైస్వాల్  ,Music Director : Chiranthan Bhat / చిరంతన్ భట్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Shreya Ghoshal / శ్రేయ ఘోషాల్  ,Song Category : Love & Romantic Songs
పల్లవి : ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో ఏమో

 అటు అటు అటు అని నడకలు ఎక్కడికో ఏమో''

 సడేలేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో

 స్వరం లేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో

 ఇలాంటివేం తెలియక ముందే 

   మనం అనే కథానిక మొదలైందో

 మనం అనే కథానిక మొదలైందో

 ''

 చరణం : 1

 ఒక్కొక్క రోజుని ఒక్కొక్క ఘడియగ కుదించ వీలవకా

 చిరాకు పడేట్టు పరారయ్యిందో సమయం క నపడక

 ప్రపంచమంతా పరాభవంతో తలొంచి వెళిపోదా

 తనోటి ఉందని మనం ఎలాగ గమనించం గనక

 కలగంటున్నా మెలకువలో ఉన్నాం కదా

 మనదరికెవరు వస్తారు కదిలించగా

 ఉషస్సెలా ఉదయిస్తుందో నిశిధెలా ఎటు పోతుందో

 నిదర ఎపుడు నిదరౌతుందో 

   మొదలు ఎపుడు మొదలౌతుందో

''

 పమగరిసారీ ససససారీ నిగాగారీ గదమదా     (2)

 చరణం : 2

 పెదాల మీదుగా అదేమి గలగల పదాల మాదిరిగ

 సుధల్ని చిలికిన సుమాల చినుకుల అనేంత మాధురిగ

 ఇలాంటి వేళకు ఇలాంటి ఊసులు ప్రపంచ భాష కదా

 ఫలాన అర్థం అనేది తెలిపే నిఘంటువుండదుగా

 కాబోతున్న కళ్యాణ మంత్రాలుగా

 వినబోతున్న సన్నాయి మేళాలుగా    ''

0 comments:

Post a Comment