Sunday, July 5, 2020

Kalyana mandapam » Chukkalu Pade      కళ్యాణ మండపం » చుక్కలు పాడే

July 05, 2020 Posted by Publisher , No comments


Song » Chukkalu Pade / చుక్కలు పాడే
Song Details:Actor : Shobhan Babu / శోభన్ బాబు  ,Actress : Kanchana / కాంచన  ,Music Director : P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,Lyrics Writer : Devulapalli Venkata Krishna Sastry / దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi :

 chukkalu paaDae SubhamaMtraM

 dikkulu niMDae divyamaMtraM

 ekkaDanO epuDO evarO palikina vaedamaMtraM

 ikkaDanae ipuDae evarO...

 naa chevilO oodina maMtraM madhu maMtraM

 chukkalu paaDae SubhamaMtraM
 charaNaM : 1

 rekkalapai aa guvvala jaMTa... aa...

 raekulalO aa pushpala jaMTa... aa...

IIrekkalapaiII

 saaguchunae... ooguchunae...

 madhura madhuramuga makkuvuga

 chaduvukunae aanaMda maMtraM

 chukkalu paaDae SubhamaMtraM
 charaNaM : 2

 kannulu okapari moosukoni...

 neevannadi mari mari talachukoni...

IIkannuluII

 okkatenae nokkatenae

 adae paniganae sadaa manasulO

 aalapiMchae priya maMtraM

 chukkalu paaDae SubhamaMtraM

 charaNaM : 3

 kOvela daivaM pilichaedaakaa... aa...

 aavali oDDuna nilichaedaakaa... aa...

IIkOvelaII

 naalOnae... lOlOnae...

 naati charaami naati charaami

 adi naa praaNa maMtraM

IIchukkaluII

www.raaga.com/player4/
Click here to hear the song
పల్లవి :

 చుక్కలు పాడే శుభమంత్రం

 దిక్కులు నిండే దివ్యమంత్రం

 ఎక్కడనో ఎపుడో ఎవరో పలికిన వేదమంత్రం

 ఇక్కడనే ఇపుడే ఎవరో...

 నా చెవిలో ఊదిన మంత్రం మధు మంత్రం

 చుక్కలు పాడే శుభమంత్రం
 చరణం : 1

 రెక్కలపై ఆ గువ్వల జంట... ఆ...

 రేకులలో ఆ పుష్పల జంట... ఆ...

 ॥రెక్కలపై॥

 సాగుచునే... ఊగుచునే...

 మధుర మధురముగ మక్కువుగ

 చదువుకునే ఆనంద మంత్రం

 చుక్కలు పాడే శుభమంత్రం
 చరణం : 2

 కన్నులు ఒకపరి మూసుకొని...

 నీవన్నది మరి మరి తలచుకొని...

 ॥కన్నులు॥

 ఒక్కతెనే నొక్కతెనే

 అదే పనిగనే సదా మనసులో

 ఆలపించే ప్రియ మంత్రం

 చుక్కలు పాడే శుభమంత్రం
 చరణం : 3

 కోవెల దైవం పిలిచేదాకా... ఆ...

 ఆవలి ఒడ్డున నిలిచేదాకా... ఆ...

 ॥కోవెల॥

 నాలోనే... లోలోనే...

 నాతి చరామి నాతి చరామి

 అది నా ప్రాణ మంత్రం

 ॥చుక్కలు॥


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment