Friday, July 10, 2020

Jonnavithula Parodies » DorakadU eTuvaMTi kUraa      జొన్నవిత్తుల ప్యారడీలు » దొరకదూ ఎటువంటి కూరా

July 10, 2020 Posted by Publisher , No comments

Song » DorakadU eTuvaMTi kUraa / దొరకదూ ఎటువంటి కూరా
Song Details:Actor : None / ఎవరూలేరు  ,Actress : None / ఎవరూలేరు  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Jonnavithulla / జొన్నవిత్తుల ,Singer : N/A / వర్తించదు ,Song Category : Parody Songs

దొరకదూ ఎటువంటి కూరా 
దొరకదూ ఎటువంటి కూరా 
ఆ ధర ఆకాశమును చేరి
బ్రహ్మాండ గోళాలు దాటిందిలే పిచ్చితల్లీ // దొరకదూ //
 
కొనలేము వంకాయ
కొట్టలేము టెంకాయ
పెట్టలేము ఆవకాయ
తినలేము మాగాయ // కొనలేము //
ఈ పాడు ధరలూ తగ్గేది లేదు
ఏ గవర్నమెంటూ పట్టించుకోదూ
కొత్తిమీర కూడా కొనలేము తల్లీ
ఆఆ .. ఆఆ .. ఆఆ.. ఆఆ  // దొరకదూ //
 
నిత్యావసరమైన సరుకులే కల్తీలు
కొందామనుకుంటె కొట్టాలి పల్టీలు
తింటే గల్లంతు శాల్తీలు
పెట్రోలు, డీజిలు పెరిగేది మాములు
రూపాయి పతనము ప్రతి రోజు కామను
ఇది తలచుకుంటే తల తిరుగు తల్లీ
తల తిరుగు తల్లీ 
ఆఅ .. ఆఆ .. ఆఆ ...
దొరకదూ ఎటువంటి కూరా ...

0 comments:

Post a Comment