Friday, July 24, 2020

Jeevanatarangaalu » Puttinaroju      జీవన తరంగాలు » పుట్టినరోజు

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Puttinaroju / పుట్టినరోజు

Song Details:Actor : Shobhan Babu / శోభన్ బాబు  ,Actress : Vanisree / వాణిశ్రీ ,Music Director : J.V.Raghavulu / జె.వి.రాఘవులు ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi :

puTTinarOju paMDagE aMdariki

mari puTTiMdi eMdukO telisEdi eMdariki

puTTinarOju paMDagE aMdariki

mari puTTiMdi eMdukO telisEdi eMdariki

eMdariki eMdariki...
caraNaM : 

kalimikEmi valasinaMta unnA

manasu celimi koraku cEyi cAcutuMdi

A manasE eMta pEdaidainA

anurAgapu sirulu paMcutuMdi

mamata koraku tapiyiMcE jIvanaM

mamata koraku tapiyiMcE jIvanaM

daivamaMdiraMlA paramapAva naM

puTTinarOju paMDagE aMdariki

mari puTTiMdi eMdukO telisEdi eMdariki

eMdariki... eMdariki...
caraNaM : 

puvveMduku tIgapai puDutuMdi

jaDalOnO guDilOnO nilavAlani

mutyamEla kaDalilO puDutuMdi

muccaTaina hAraMlO meravAlani

prati maniShi tana janmaku paramArthaM telusukoni

tana kOsamE kAdu parula koraku bratakAlani

tana kOsamE kAdu parula koraku bratakAlani

tAnunnA... lEkunnA...

tAnunnA lEkunnA tana pEru migalAli

puTTinarOju paMDagE aMdariki

mari puTTiMdi eMdukO telisEdi eMdariki

eMdariki... eMdariki...
 
Click here to hear the song
పల్లవి :

పుట్టినరోజు పండగే అందరికి

మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి

పుట్టినరోజు పండగే అందరికి

మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి

ఎందరికి ఎందరికి...
చరణం : 

కలిమికేమి వలసినంత ఉన్నా

మనసు చెలిమి కొరకు చేయి చాచుతుంది

ఆ మనసే ఎంత పేదైదైనా

అనురాగపు సిరులు పంచుతుంది

మమత కొరకు తపియించే జీవనం

మమత కొరకు తపియించే జీవనం

దైవమందిరంలా పరమపావ నం

పుట్టినరోజు పండగే అందరికి

మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి

ఎందరికి... ఎందరికి...
చరణం : 

పువ్వెందుకు తీగపై పుడుతుంది

జడలోనో గుడిలోనో నిలవాలని

ముత్యమేల కడలిలో పుడుతుంది

ముచ్చటైన హారంలో మెరవాలని

ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని

తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలని

తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలని

తానున్నా... లేకున్నా...

తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి

పుట్టినరోజు పండగే అందరికి

మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి

ఎందరికి... ఎందరికి...
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment