Monday, July 6, 2020

Jeevanatarangaalu » E Jeevanatarangalalo జీవన తరంగాలు » ఈ జీవనతరంగాలలో

July 06, 2020 Posted by Publisher , No comments

Song » E Jeevanatarangalalo / ఈ జీవనతరంగాలలో

Song Details:Actor : Shobhan Babu / శోభన్ బాబు  Actress : Vanisree / వాణిశ్రీ Music Director : J.V.Raghavulu / జె.వి.రాఘవులు Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : Ghantasala / ఘంటసాల  Song Category : Others
saakee :

padimaasaalu mOSaavu pillalanu

bratukaMtaa mOSaavu baadhalanu

inni mOsina ninnu mOsaevaaLLu laeka veLutunnaavu

pallavi :

ee jeevanataraMgaalalO... aa daevuni chadaraMgaMlO

evariki evaru soMtamu... eMtavarakee baMdhamu
charaNaM : 1

kaDupu chiMchuku puTTiMdokaru

kaaTiki ninnu mOsaedokaru

talaku korivi peTTaedokaru

aapai neetO vachchaedevaru... aapai neetO vachchaedevaru

ee jeevanataraMgaalalO... aa daevuni chadaraMgaMlO

evariki evaru soMtamu... eMtavarakee baMdhamu
charaNaM : 2

mamatae manishiki baMdikhaanaa

bhayapaDi teMchuku paaripOyinaa

teliyani paaSaM veMTabaDi RNaM teerchukOmaMTuMdi

teliyani paaSaM veMTabaDi RNaM teerchukOmaMTuMdi

nee bhujaM maarchukOmaMTuMdi

ee jeevanataraMgaalalO... aa daevuni chadaraMgaMlO

evariki evaru soMtamu... eMtavarakee baMdhamu
charaNaM : 3

taaLi kaTTina magaDu laeDani

taraliMchuku pOyae mRtyuvaagadu

ee kaTTenu kaTTelu kaalchaka maanavu

aa kanneeLLaku chitimaMTalaaravu

ee maMTalu aa guMDenu aMTaka maanavu

ee jeevanataraMgaalalO... aa daevuni chadaraMgaMlO

evariki evaru soMtamu... eMtavarakee baMdhamu

ee jeevanataraMgaalalO...
సాకీ :

పదిమాసాలు మోశావు పిల్లలను

బ్రతుకంతా మోశావు బాధలను

ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు
పల్లవి :

ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో

ఎవరికి ఎవరు సొంతము... ఎంతవరకీ బంధము
చరణం : 1

కడుపు చించుకు పుట్టిందొకరు

కాటికి నిన్ను మోసేదొకరు

తలకు కొరివి పెట్టేదొకరు

ఆపై నీతో వచ్చేదెవరు... ఆపై నీతో వచ్చేదెవరు

ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో

ఎవరికి ఎవరు సొంతము... ఎంతవరకీ బంధము
చరణం : 2

మమతే మనిషికి బందిఖానా

భయపడి తెంచుకు పారిపోయినా

తెలియని పాశం వెంటబడి ఋణం తీర్చుకోమంటుంది

తెలియని పాశం వెంటబడి ఋణం తీర్చుకోమంటుంది

నీ భుజం మార్చుకోమంటుంది

ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో

ఎవరికి ఎవరు సొంతము... ఎంతవరకీ బంధము
చరణం : 3

తాళి కట్టిన మగడు లేడని

తరలించుకు పోయే మృత్యువాగదు

ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు

ఆ కన్నీళ్ళకు చితిమంటలారవు

ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు

ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో

ఎవరికి ఎవరు సొంతము... ఎంతవరకీ బంధము

ఈ జీవనతరంగాలలో...

0 comments:

Post a Comment