Monday, July 6, 2020

Jeevanatarangaalu » E Andaniki జీవన తరంగాలు » ఈ అందానికి

July 06, 2020 Posted by Publisher , No comments


Song » E Andaniki / ఈ అందానికి

Song Details:Actor : Shobhan Babu / శోభన్ బాబు  Actress : Vanisree / వాణిశ్రీ Music Director : J.V.Raghavulu / జె.వి.రాఘవులు Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  Song Category : Others
pallavi : 

 ee aMdaaniki baMdhaM vaeSaanokanaaDu

 aa baMdhamae naakaMdamainadi eenaaDu

IIee aMdaanikiII
 charaNaM : 1

 nee kaLlu aanaaDu erupekkenu

 naeDu aa erupe nee buggapai paakenu

IInee kaLluII

 nee chaetulaanaaDu teralaayenu

 naeDu aa terale kaugilai penavaesenu

IIee aMdaanikiII
 charaNaM : 2

 nee vaeDilOnae naa chaluva uMdani

 vaana eMDanu chaeriMdi

 nee chaluvae naa vaeDiki viluvani

 eMDae vaananu mechchiMdi

IInee vaeDilOnaeII

 iddaru kalisina aa oddikalO

 iMdradhanassae virisiMdi

 aeDuraMgula muggulu vaesi

 niMgeenaelanu kalipiMdi

 praemaku peLlae chaesiMdi

IIee aMdaanikiII
పల్లవి : 

 ఈ అందానికి బంధం వేశానొకనాడు

 ఆ బంధమే నాకందమైనది ఈనాడు

 ॥ఈ అందానికి॥
 చరణం : 1

 నీ కళ్లు ఆనాడు ఎరుపెక్కెను

 నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను

 ॥నీ కళ్లు॥

 నీ చేతులానాడు తెరలాయెను

 నేడు ఆ తెరలె కౌగిలై పెనవేసెను

 ॥ఈ అందానికి॥
 చరణం : 2

 నీ వేడిలోనే నా చలువ ఉందని

 వాన ఎండను చేరింది

 నీ చలువే నా వేడికి విలువని

 ఎండే వానను మెచ్చింది

 ॥నీ వేడిలోనే॥

 ఇద్దరు కలిసిన ఆ ఒద్దికలో

 ఇంద్రధనస్సే విరిసింది

 ఏడురంగుల ముగ్గులు వేసి

 నింగీనేలను కలిపింది

 ప్రేమకు పెళ్లే చేసింది

 ॥ఈ అందానికి॥

0 comments:

Post a Comment