Friday, July 10, 2020

Jayam Manade » Vinavoyi Batasari      జయం మనదే » వినవోయి బాటసారి

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Vinavoyi Batasari / వినవోయి బాటసారి
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Shavukaru Janaki / షావుకారు జానకి  ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Inspiring & Motivational Songs
vinavOyI bATasAri 
kanavOyI muMdu dAri vinavOyI
kaShTAlu evarikaina - kalakAlaM uMDavOyI
AnaMdaM anuBaviMcu - avakASaM kalugunOy
tagadOyI paritApaM
kadali rAvOy eduru lEdOy vinavOyI
nidurabOvu lOkAnni - cEyitaTTi lEpavOy
aMdhakAramaMtariMci - velugujADa tOcunOy
kAlaM nI kanukUlaM
talacukOvOy
telusukOvOy
nIrasiMcu SaktinaMta - cEradIyabUnavOy
jIvitammu sArdhakammu - cEyudAri vedakavOy
janavAkyaM manadEnOy
BayamulEdOy
jayamu nIdOy vinavOyI
 
Click here to hear the song
వినవోయీ బాటసారి 
కనవోయీ ముందు దారి వినవోయీ
కష్టాలు ఎవరికైన - కలకాలం ఉండవోయీ
ఆనందం అనుభవించు - అవకాశం కలుగునోయ్
తగదోయీ పరితాపం
కదలి రావోయ్ ఎదురు లేదోయ్ వినవోయీ
నిదురబోవు లోకాన్ని - చేయితట్టి లేపవోయ్
అంధకారమంతరించి - వెలుగుజాడ తోచునోయ్
కాలం నీ కనుకూలం
తలచుకోవోయ్
తెలుసుకోవోయ్
నీరసించు శక్తినంత - చేరదీయబూనవోయ్
జీవితమ్ము సార్ధకమ్ము - చేయుదారి వెదకవోయ్
జనవాక్యం మనదేనోయ్
భయములేదోయ్
జయము నీదోయ్ వినవోయీ
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment