Saturday, July 11, 2020

Jayam Manade » Chilakanna chilakave      జయం మనదే » చిలకన్న చిలకవే

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Chilakanna chilakave / చిలకన్న చిలకవే
Song Details:Actor : Relangi(relangi venkatramayya) / రేలంగి (రేలంగి వెంకటరామయ్య)  ,Actress :Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,  Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం  ,Song Category : Phylosophical Songs
cilakanna cilakavE baMgAru gilaka^^e 
paMcavannela rAma cilaka hoy
paMcavannela rAma cilaka cilaka  2
A: EDukoMDala mIda egiri vaccina piTTa
eMdunnadO ceppavE eMdunnadO ceppavE 
mEDallO unnadO middellO unnadO
jADainA ceppavE cilakA dAni
nIDainA ceppavE cilakA
A : paMjarammuna inupa saMkeLLu tagiliMci
baMdhiMci uMcAre cilukA
mUDAru vAkiLLu dATi rAvAlaMTe
kODetAcunnade cilukA
kODetAcunnade cilukA
a: paTTubaDDA cOTa prANAnikEmaina
mOsaMbulEdaTE cilakA
mOsammu lEdaTE cilakA
paccanni cElapai svEccagA egirETi
BAgyameppuDe rAmacilakA aMta BAgyameppuDe rAma cilakA
A: baMdhAlu viDipiMci baiTikaMpAlaMTE
samayammu cikkAle cilukA
Orpu cUpaka nIvu oDupu jurrAvaMTe
Ogu tappadu rAma cilukA
A: baLuvu BArammaMta nI mIdanE beTTi
Bayamu lEkuMTAme cilakA
rAmacilakA
nILLallO muMcinA pAlallO muMcinA
nIve dikkO rAmacilakA mAku
nIve dikkO rAma cilakA cilakanna
 
Click here to hear the song
చిలకన్న చిలకవే బంగారు గిలకఎ 
పంచవన్నెల రామ చిలక హొయ్
పంచవన్నెల రామ చిలక చిలక  2
ఆ: ఏడుకొండల మీద ఎగిరి వచ్చిన పిట్ట
ఎందున్నదో చెప్పవే ఎందున్నదో చెప్పవే 
మేడల్లో ఉన్నదో మిద్దెల్లో ఉన్నదో
జాడైనా చెప్పవే చిలకా దాని
నీడైనా చెప్పవే చిలకా
ఆ : పంజరమ్మున ఇనుప సంకెళ్ళు తగిలించి
బంధించి ఉంచారె చిలుకా
మూడారు వాకిళ్ళు దాటి రావాలంటె
కోడెతాచున్నదె చిలుకా
కోడెతాచున్నదె చిలుకా
అ: పట్టుబడ్డా చోట ప్రాణానికేమైన
మోసంబులేదటే చిలకా
మోసమ్ము లేదటే చిలకా
పచ్చన్ని చేలపై స్వేచ్చగా ఎగిరేటి
భాగ్యమెప్పుడె రామచిలకా అంత భాగ్యమెప్పుడె రామ చిలకా
ఆ: బంధాలు విడిపించి బైటికంపాలంటే
సమయమ్ము చిక్కాలె చిలుకా
ఓర్పు చూపక నీవు ఒడుపు జుర్రావంటె
ఓగు తప్పదు రామ చిలుకా
ఆ: బళువు భారమ్మంత నీ మీదనే బెట్టి
భయము లేకుంటామె చిలకా
రామచిలకా
నీళ్ళల్లో ముంచినా పాలల్లో ముంచినా
నీవె దిక్కో రామచిలకా మాకు
నీవె దిక్కో రామ చిలకా చిలకన్న



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment