Saturday, July 11, 2020

Jayabheri » Raagamaye raave      జయభేరి » రాగమయీ రావే

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Raagamaye raave / రాగమయీ రావే
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Anjali devi / అంజలి దేవి ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Malladi Ramakrishna Sastri / మల్లాది రామకృష్ణశాస్త్రి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
pallavi :

raagamayee raavae anuraagamayee raavae

raagamayee raavae anuraagamayee raavae

raagamayee raavae...

anupallavi :

neelaala gaganaana niMDina vennela

neelaala gaganaana niMDina vennela

nee chirunavvula kalakalalaaDaga

raagamayee raavae anuraagamayee raavae
raagamayee raavae...

charaNaM : 1

chivurulu maesina chinnaari kOyila

marimari murisae maadhuri neevae

chivurulu maesina chinnaari kOyila

marimari murisae maadhuri neevae

tanuvai manasai nelaraayanitO

kaluvalu kulikae sarasaalu neevae

sarasaalu neevae saraagaalu naenae

raagamayee raavae anuraagamayee raavae

raagamayee raavae...
charaNaM : 2

saMjelalO saMjelalO haayiga saagae challanigaalilO

marumallela virajaajula parimaLamae neevu

jilugae siMgaaramaina chukka kannelu aMbaraana

jilugae siMgaaramaina chukka kannelu aMbaraana

saMbarapaDu chakkiligiMtala paravaSamae naenu

nava parimaLamae neevu

raavae raagamayee naa anuraagamayee

raavae raagamayee naa anuraagamayee
charaNaM : 3

neeDajoosi neevanukoni pulakariMtunae

alavikaani mamatalatO kaluvariMtunae

nee kOsamae aavaedana nee roopamae aalaapana

kannelaMdaroo kalalu kanae aMdaalannee neevae

ninnaMdukonee maimarachae aanaMdamaMtaa naenae

raavae raagamayee naa anuraagamayee

raavae raagamayee naa anuraagamayee
 
Click here to hear the song
పల్లవి :

రాగమయీ రావే అనురాగమయీ రావే

రాగమయీ రావే అనురాగమయీ రావే

రాగమయీ రావే...

అనుపల్లవి :

నీలాల గగనాన నిండిన వెన్నెల

నీలాల గగనాన నిండిన వెన్నెల

నీ చిరునవ్వుల కలకలలాడగ

రాగమయీ రావే అనురాగమయీ రావే

రాగమయీ రావే...
చరణం : 1

చివురులు మేసిన చిన్నారి కోయిల

మరిమరి మురిసే మాధురి నీవే

చివురులు మేసిన చిన్నారి కోయిల

మరిమరి మురిసే మాధురి నీవే

తనువై మనసై నెలరాయనితో

కలువలు కులికే సరసాలు నీవే

సరసాలు నీవే సరాగాలు నేనే

రాగమయీ రావే అనురాగమయీ రావే

రాగమయీ రావే...
చరణం : 2

సంజెలలో సంజెలలో హాయిగ సాగే చల్లనిగాలిలో

మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు

జిలుగే సింగారమైన చుక్క కన్నెలు అంబరాన

జిలుగే సింగారమైన చుక్క కన్నెలు అంబరాన

సంబరపడు చక్కిలిగింతల పరవశమే నేను

నవ పరిమళమే నీవు

రావే రాగమయీ నా అనురాగమయీ

రావే రాగమయీ నా అనురాగమయీ
చరణం : 3

నీడజూసి నీవనుకొని పులకరింతునే

అలవికాని మమతలతో కలువరింతునే

నీ కోసమే ఆవేదన నీ రూపమే ఆలాపన

కన్నెలందరూ కలలు కనే అందాలన్నీ నీవే

నిన్నందుకొనీ మైమరచే ఆనందమంతా నేనే

రావే రాగమయీ నా అనురాగమయీ

రావే రాగమయీ నా అనురాగమయీ
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment