Tuesday, July 14, 2020

Jaya Simha » Nadireyi Gadichene      జయ సింహ » నడిరేయి గడిచేనే

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Nadireyi Gadichene / నడిరేయి గడిచేనే
Song Details:Actor :NTR / ఎన్ టీ ఆర్  ,Actress :Anjali devi / అంజలి దేవి ,Music Director :TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer :Samudrala Junior / సముద్రాల జూనియర్ ,Singer :P.Suseela / పి. సుశీల  ,Song Category : Love & Romantic Songs
naDirEyi gaDicEnE celiyaa
raaDaayenE saami naa saami
raaDaayenE saami nEDU ||naDi||
eduru tennulu cUci cUci
I celiyaa vaanikai vEci vEci nEDu  ||naDi||
gaganaana nelarEDu digajaaripOye 
sigalOni virulanni pasivaaDipOye !
digulaayanE ..(2) madi vagalE migulaayE
magaraayaDE vaaDu manalEnO nEDU ||naDi||
gaDipaa paDigaapu paDiyuMDalEnE !
gaDiyekka yugamuna gaDupaga lEnE! || gaDapaa||
eDabaaTutO _ eDabaaTutO 
gamarisa risanisadapa gamarigama eDabaaTutO 
saa..nI..daa..saanI sanidapama
nI..daa..paa..nIda nidapamaga
maapamagamagama paadapa mapamasa
daanida pada pada ninisani papadamapa 
eDabaaTutO I saDilEni rEyi
kaDalEni kannIrai niluvagalEnE  ||naDi||
Click here to hear the song
నడిరేయి గడిచేనే చెలియా
రాడాయెనే సామి నా సామి
రాడాయెనే సామి నేడూ ||నడి||
ఎదురు తెన్నులు చూచి చూచి
ఈ చెలియా వానికై వేచి వేచి నేడు  ||నడి||
గగనాన నెలరేడు దిగజారిపోయె 
సిగలోని విరులన్ని పసివాడిపోయె !
దిగులాయనే ..(2) మది వగలే మిగులాయే
మగరాయడే వాడు మనలేనో నేడూ ||నడి||
గడిపా పడిగాపు పడియుండలేనే !
గడియెక్క యుగమున గడుపగ లేనే! || గడపా||
ఎడబాటుతో _ ఎడబాటుతో 
గమరిస రిసనిసదప గమరిగమ ఎడబాటుతో 
సా..నీ..దా..సానీ సనిదపమ
నీ..దా..పా..నీద నిదపమగ
మాపమగమగమ పాదప మపమస
దానిద పద పద నినిసని పపదమప 
ఎడబాటుతో ఈ సడిలేని రేయి
కడలేని కన్నీరై నిలువగలేనే  ||నడి||
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment