Monday, July 13, 2020

Janatha Garage » Pranaamam      జనతా గ్యారేజ్ » ప్రణామమ్

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Pranaamam / ప్రణామమ్
Song Details:Actor : Jr-ntr / జూనియర్ ఎన్ టీ ఆర్  ,Actress : N/A / వర్తించదు ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Shankar Mahadevan / శంకర్ మహాదేవన్ ,Song Category : Inspiring & Motivational Songs
pallavi:
praNAmaM praNAmaM praNAmaM
praBAta sUryuDiki praNAmaM
praNAmaM praNAmaM praNAmaM
samasta prakRutiki praNAmaM
pramOdaM pramOdaM pramOdaM
pratI sRuShTi citraM pramOdaM
prayANaM prayANaM prayANaM
viSvaMtO mamEkaM prayANaM



caraNaM:1
mana cirunavvulE pUlu
niTTUrpulE taDi mEGAlu
hRudayamE gaganaM
rudhiramE saMdraM ASE paccadanaM
mArE Rutuvula varNaM 
mana manasula BAvOdvEgaM
sarigA cUstE prakRuti mottaM
manalO pratibiMbaM
nuvveMta nEneMta ravvaMta
ennO ELladI sRuShTi carita
anuBavamE dAciMdI koMDaMta
tana aDugullO aDugEsi
veLadAM janmaMtA



caraNaM:2
evaDiki soMtamidaMtA 
idi evvaDu nATina paMTa
evaDiki vADidi
nAdE hakkani ceyyEstE eTTA
taramulanATi kathaMtA 
mana tadupari migalAlaMTa
kadapaka cerapaka
padikAlAlidi kApADAlaMTa
prEmiMcE peddammE I viSvaM 
iShTaMgA guMDeku hattukuMdAM
kannerla kannIrai O koMceM
tallaDilliMdO I tallI E okkaru migalaM.
పల్లవి:
ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
ప్రమోదం ప్రమోదం ప్రమోదం
ప్రతీ సృష్టి చిత్రం ప్రమోదం
ప్రయాణం ప్రయాణం ప్రయాణం
విశ్వంతో మమేకం ప్రయాణం



చరణం:
మన చిరునవ్వులే పూలు
నిట్టూర్పులే తడి మేఘాలు
హృదయమే గగనం
రుధిరమే సంద్రం ఆశే పచ్చదనం
మారే ఋతువుల వర్ణం 
మన మనసుల భావోద్వేగం
సరిగా చూస్తే ప్రకృతి మొత్తం
మనలో ప్రతిబింబం
నువ్వెంత నేనెంత రవ్వంత
ఎన్నో ఏళ్లదీ సృష్టి చరిత
అనుభవమే దాచిందీ కొండంత
తన అడుగుల్లో అడుగేసి
వెళదాం జన్మంతా



చరణం:2
ఎవడికి సొంతమిదంతా 
ఇది ఎవ్వడు నాటిన పంట
ఎవడికి వాడిది
నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టా
తరములనాటి కథంతా 
మన తదుపరి మిగలాలంట
కదపక చెరపక
పదికాలాలిది కాపాడాలంట
ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం 
ఇష్టంగా గుండెకు హత్తుకుందాం
కన్నెర్ల కన్నీరై ఓ కొంచెం
తల్లడిల్లిందో ఈ తల్లీ ఏ ఒక్కరు మిగలం.

0 comments:

Post a Comment