Monday, July 13, 2020

Janatha Garage » Jaiho Janatha      జనతా గ్యారేజ్ » జయహొ జనతా

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Jaiho Janatha / జయహొ జనతా

Song Details:Actor : Jr-ntr / జూనియర్ ఎన్ టీ ఆర్  ,Actress : N/A / వర్తించదు ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Sukhwinder Singh / సుఖ్వీందర్ సింగ్  ,  Vijay Prakash / విజయ్ ప్రకాశ్ ,Song Category : Inspiring & Motivational Songs
evvaru evvaru vIrevaru 
evariki varusaki EmavarU
ayinA aMdari baMdhuvulu
jayahO janatA
okkaru kAdu EDugurU
dEvuDu paMpina sainikulu
sAyaM cEsE sAyudhulu
jayahO janatA
venukaDugaipOru manakeMduku anukOru
jagamaMtA manadE parivAraM aMTAru
prANaM pOtunnA pramAdaM anukOru
parulaku velugiccE dhyEyaMgA puTTAru



caraNaM:
ApadalO niTTUrpu adi cAllE vIriki pilupu
dUsukupOtAru durmArgaM ninipElA
ekkaDakakkaDa tIrpu vIraMdiMcE OdArpu
tODaivuMTAru tObuTTina baMdhaMlA
manasE caTTaMgA prati maniShiki cuTTaMgA
mEmunnAmaMTAru 
kannILlallO navvulu pUyistU



caraNaM:2
dharmaM gelavani cOTa tappadu kattula vETa
tappU oppEdO saMhAraM taruvAta
raNamuna BagavadgIta cadiviMdi mana gatacarita
rakkasi mUkalaku bratikE hakkE lEdaMTA
evarO vastAru manakEdO cEstAru
ani vEcE vEdanakU javAbE I janatA
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు 
ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురూ
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా
వెనుకడుగైపోరు మనకెందుకు అనుకోరు
జగమంతా మనదే పరివారం అంటారు
ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు
పరులకు వెలుగిచ్చే ధ్యేయంగా పుట్టారు



చరణం:1
ఆపదలో నిట్టూర్పు అది చాల్లే వీరికి పిలుపు
దూసుకుపోతారు దుర్మార్గం నినిపేలా
ఎక్కడకక్కడ తీర్పు వీరందించే ఓదార్పు
తోడైవుంటారు తోబుట్టిన బంధంలా
మనసే చట్టంగా ప్రతి మనిషికి చుట్టంగా
మేమున్నామంటారు 
కన్నీళ్లల్లో నవ్వులు పూయిస్తూ



చరణం:2
ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట
తప్పూ ఒప్పేదో సంహారం తరువాత
రణమున భగవద్గీత చదివింది మన గతచరిత
రక్కసి మూకలకు బ్రతికే హక్కే లేదంటా
ఎవరో వస్తారు మనకేదో చేస్తారు
అని వేచే వేదనకూ జవాబే ఈ జనతా

0 comments:

Post a Comment