Song » Veera Bhaaratheeya / వీర భారతీయ
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Bharati / భారతి ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Sri sri / శ్రీ శ్రీ ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Folk Songs
vIra bhaaratIya paurullaaraa...aa..aa..aa dEsha maata pilupu vinalEraa..aa..aa..aa himaalayaMlO maTalu rEgi pramaada samayaM vacciMdi swataMtra bhaarata yOdhullaaraa savaaledurkoni kadalaMDi swataMtra bhaarata yOdhullaaraa savaaledurkoni kadalaMDi savaaledurkoni kadalaMDi aMtaa snEhitulanukunnaamu aMdari mElu aashiMcaamu aMdari mElu aashiMcaamu parula maMcikai nammakamuMci pagaTi kalalalO jIviMcaamu nETiki kaligenu kanuvippu muMcuku vaccenu penumuppu swataMtra bhaarata yOdhullaaraa savaaledurkoni kadalaMDi savaaledurkoni kadalaMDi vIramaatalaaraa sutulaku caMdhana gaMdhaM pUyaMDi caMdhana gaMdhaM pUyaMDi vIra vanitalaaraa patulaku kuMkuma tilakaM tIracaMDi kuMkuma tilakaM tIracaMDi netturu jaMkE yuvakullaaraa kattulu dUsi dukaMDi baanisatanamuna bratikE kannaa caavE mElani talacaMDi swataMtra bhaarata yOdhullaaraa savaaledurkoni kadalaMDi savaaledurkoni kadalaMDi manamaMtaa oka jaati samaikyamE mana nIti manamaMtaa oka jaati samaikyamE mana nIti kulamEdainaa matamEdainaa vEShaM bhaaSha vErE ayinaa janamokaTE ani caaTaMDi dharma dIkShayE mana kavacaM tappaka manadE GanavijayaM swataMtra bhaarata yOdhullaaraa savaaledurkoni kadalaMDi savaaledurkoni kadalaMDi bharatamaata paruvu nilpagaa...aa..aa..aa bharata vIra pratina daalcaraa... aa..aa..aa jayapataaka cEtabUnaraa..aa..aa..aa samara vijaya shaMKamUdaraa..aa..aa..aa samara vijaya shaMKamUdaraa.. Click here to hear the song
వీర భారతీయ పౌరుల్లారా...ఆ..ఆ..ఆ దేశ మాత పిలుపు వినలేరా..ఆ..ఆ..ఆ హిమాలయంలో మటలు రేగి ప్రమాద సమయం వచ్చింది స్వతంత్ర భారత యోధుల్లారా సవాలెదుర్కొని కదలండి స్వతంత్ర భారత యోధుల్లారా సవాలెదుర్కొని కదలండి సవాలెదుర్కొని కదలండి అంతా స్నేహితులనుకున్నాము అందరి మేలు ఆశించాము అందరి మేలు ఆశించాము పరుల మంచికై నమ్మకముంచి పగటి కలలలో జీవించాము నేటికి కలిగెను కనువిప్పు ముంచుకు వచ్చెను పెనుముప్పు స్వతంత్ర భారత యోధుల్లారా సవాలెదుర్కొని కదలండి సవాలెదుర్కొని కదలండి వీరమాతలారా సుతులకు చంధన గంధం పూయండి చంధన గంధం పూయండి వీర వనితలారా పతులకు కుంకుమ తిలకం తీరచండి కుంకుమ తిలకం తీరచండి నెత్తురు జంకే యువకుల్లారా కత్తులు దూసి దుకండి బానిసతనమున బ్రతికే కన్నా చావే మేలని తలచండి స్వతంత్ర భారత యోధుల్లారా సవాలెదుర్కొని కదలండి సవాలెదుర్కొని కదలండి మనమంతా ఒక జాతి సమైక్యమే మన నీతి మనమంతా ఒక జాతి సమైక్యమే మన నీతి కులమేదైనా మతమేదైనా వేషం భాష వేరే అయినా జనమొకటే అని చాటండి ధర్మ దీక్షయే మన కవచం తప్పక మనదే ఘనవిజయం స్వతంత్ర భారత యోధుల్లారా సవాలెదుర్కొని కదలండి సవాలెదుర్కొని కదలండి భరతమాత పరువు నిల్పగా...ఆ..ఆ..ఆ భరత వీర ప్రతిన దాల్చరా... ఆ..ఆ..ఆ జయపతాక చేతబూనరా..ఆ..ఆ..ఆ సమర విజయ శంఖమూదరా..ఆ..ఆ..ఆ సమర విజయ శంఖమూదరా.. ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment