Song » Priyathamaa Nanu / ప్రియతమా నను
Song Details:Actor :
Chiranjeevi / చిరంజీవి ,Actress :
Sridevi / శ్రీదేవి ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
priyatamaa nanu palakariMcu praNayamaa atidhilaa nanu cErukunna hRudayamaa bratukulOni baMdamaa palukalEni bhaavamaa maruvalEni snEhamaa maraliraani nEstamaa priyatamaa priyatamaa priyatamaa aa.. priyatamaa nanu palakariMcu praNayamaa atidhilaa nanu cErukunna hRudayamaa eduTa unna swargamaa cediripOni swapnamaa kanulalOni kaavyamaa kaugiLiMta praaNamaa... priyatamaa priyatamaa priyatamaa aa.. priyatamaa nanu palakariMcu praNayamaa niMgi vINakEmO nEla paaTalocce telugu jilugu annI telisi paarijaata puvvu pacci mallemogga valapE telipE naalO virisi maccalennO unna caMdamaama kanna naruDE varuDai naalO merisE taaralamma kannaa cIrakaTTukunna paDucu tanamE naalO murise mabbulannI vIDipOyi kalisE nayanaM telisE hRudayaM taaralannI daaTagaanE tagilE gaganaM ragilE virahaM rayalEni bhaaShalO enni prEmalEKalO raayi laaMTi goMtulO enni mUga paaTalO aDugE paDaka gaDuvE gaDicI pilicE priyatamaa nanu palakariMcu praNayamaa atidhilaa nanu cErukunna hRudayamaa praaNavaayuvEdO vENuvUdipOyE SRutilO jatilO ninnE kalipi dEvagaanamaMtaa eMkipaaTalaayE manasu mamata annI kalisi vennelallE vaccI vEda maMtramaaye bahushaa manasaa vaacaa valaci mEnakallE vaccI jaanakallE maarE kulamu guNamu annI kudiri nIvulEni niMgilOna veligE udayaM vidhikE vilayaM nIvulEni nElamIda bratukE praLayaM manasE maraNaM vaanavillu guMDelO nITikenni raMgulO amRutaala viMdulO eMdukinni haddulO jagamE aNuvai yugamE kShaNamai migilE priyatamaa nanu palakariMcu praNayamaa atidhilaa nanu cErukunna hRudayamaa bratukulOni baMdamaa palukalEni bhaavamaa kanulalOni kaavyamaa kaugiLiMta praaNamaa... priyatamaa priyatamaa priyatamaa aa.. priyatamaa nanu palakariMcu praNayamaa
ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిధిలా నను చేరుకున్న హృదయమా బ్రతుకులోని బందమా పలుకలేని భావమా మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా ఆ.. ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిధిలా నను చేరుకున్న హృదయమా ఎదుట ఉన్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా కనులలోని కావ్యమా కౌగిళింత ప్రాణమా... ప్రియతమా ప్రియతమా ప్రియతమా ఆ.. ప్రియతమా నను పలకరించు ప్రణయమా నింగి వీణకేమో నేల పాటలొచ్చె తెలుగు జిలుగు అన్నీ తెలిసి పారిజాత పువ్వు పచ్చి మల్లెమొగ్గ వలపే తెలిపే నాలో విరిసి మచ్చలెన్నో ఉన్న చందమామ కన్న నరుడే వరుడై నాలో మెరిసే తారలమ్మ కన్నా చీరకట్టుకున్న పడుచు తనమే నాలో మురిసె మబ్బులన్నీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం తారలన్నీ దాటగానే తగిలే గగనం రగిలే విరహం రయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో రాయి లాంటి గొంతులో ఎన్ని మూగ పాటలో అడుగే పడక గడువే గడిచీ పిలిచే ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిధిలా నను చేరుకున్న హృదయమా ప్రాణవాయువేదో వేణువూదిపోయే శృతిలో జతిలో నిన్నే కలిపి దేవగానమంతా ఎంకిపాటలాయే మనసు మమత అన్నీ కలిసి వెన్నెలల్లే వచ్చీ వేద మంత్రమాయె బహుశా మనసా వాచా వలచి మేనకల్లే వచ్చీ జానకల్లే మారే కులము గుణము అన్నీ కుదిరి నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం నీవులేని నేలమీద బ్రతుకే ప్రళయం మనసే మరణం వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో జగమే అణువై యుగమే క్షణమై మిగిలే ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిధిలా నను చేరుకున్న హృదయమా బ్రతుకులోని బందమా పలుకలేని భావమా కనులలోని కావ్యమా కౌగిళింత ప్రాణమా... ప్రియతమా ప్రియతమా ప్రియతమా ఆ.. ప్రియతమా నను పలకరించు ప్రణయమా
0 comments:
Post a Comment