Monday, July 20, 2020

Indrudu Chandrudu » Lalijo Lalijo      ఇంద్రుడు చంద్రుడు » లాలిజో లాలిజో

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Lalijo Lalijo / లాలిజో లాలిజో

Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ ,Actress : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Children Songs
mm hu hu..mm hu hu..

mm hu hu..mm hu hu..



laalijO laalijO..UrukO paapaayi

paaripOnIkuMDaa paTTukO naacEyi..

laalijO laalijO..UrukO paapaayi

paaripOnIkuMDaa paTTukO naacEyi..



telusaa I Usu?? cebutaa tala UcU!!

kaapuraM cEstunna paavuraMZ okaTuMdi

AlinE kaadaMdi kaakinER kUDiMdi..



aMtalO EmaiMdi?? aDagavE paapaayi

paaripOnIkuMDaa paTTukO naacEyi..

mm hu hu..mm hu hu..

mm hu hu..mm hu hu..



maayanE nammiMdi.. bOyatO pOyiMdi

deyyamE pUniMdO.. raayilaa maariMdi

veLLE peDadaarilO.. muLLE poDicaakanI

tappidaM telisiMdi muppunE cUsiMdi

kannulE vippiMdI.. gaMDamE tappiMdi



iMTilO cOTuMdaa? ceppavE paapaayi

paaripOnIkuMDaa paTTukO naacEyi!!



mm hu hu..mm hu hu..

mm hu hu..mm hu hu..



pillalu illaalu eMtagaa EDcaaru..

guMDelO innaaLLu koMDalE mOsaaru..



nEraM naadainaa.. bhaaraM mIpaina..

taMDrinE nEnainaa daMDamE peDutunnaa!!

tallilaa manniMcu.. mellagaa daMDiMcu

kaaLilaa maarammaa.. kaalitO tannammaa

buddilO lOpaalE.. diddukO nIvammaa!!



mm hu hu..mm hu hu..

mm hu hu..mm hu hu..



laalijO laalijO..UrukO paapaayi

paaripOnIkuMDaa paTTukO naacEyi..








Click here to hear the song
మ్మ్ హు హు..మ్మ్ హు హు..

మ్మ్ హు హు..మ్మ్ హు హు..



లాలిజో లాలిజో..ఊరుకో పాపాయి

పారిపోనీకుండా పట్టుకో నాచేయి..

లాలిజో లాలిజో..ఊరుకో పాపాయి

పారిపోనీకుండా పట్టుకో నాచేయి..



తెలుసా ఈ ఊసు?? చెబుతా తల ఊచూ!!

కాపురం చేస్తున్న పావురం ఒకటుంది

ఆలినే కాదంది కాకినే కూడింది..



అంతలో ఏమైంది?? అడగవే పాపాయి

పారిపోనీకుండా పట్టుకో నాచేయి..

మ్మ్ హు హు..మ్మ్ హు హు..

మ్మ్ హు హు..మ్మ్ హు హు..



మాయనే నమ్మింది.. బోయతో పోయింది

దెయ్యమే పూనిందో.. రాయిలా మారింది

వెళ్ళే పెడదారిలో.. ముళ్ళే పొడిచాకనీ

తప్పిదం తెలిసింది ముప్పునే చూసింది

కన్నులే విప్పిందీ.. గండమే తప్పింది



ఇంటిలో చోటుందా? చెప్పవే పాపాయి

పారిపోనీకుండా పట్టుకో నాచేయి!!



మ్మ్ హు హు..మ్మ్ హు హు..

మ్మ్ హు హు..మ్మ్ హు హు..



పిల్లలు ఇల్లాలు ఎంతగా ఏడ్చారు..

గుండెలో ఇన్నాళ్ళు కొండలే మోసారు..



నేరం నాదైనా.. భారం మీపైన..

తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా!!

తల్లిలా మన్నించు.. మెల్లగా దండించు

కాళిలా మారమ్మా.. కాలితో తన్నమ్మా

బుద్దిలో లోపాలే.. దిద్దుకో నీవమ్మా!!



మ్మ్ హు హు..మ్మ్ హు హు..

మ్మ్ హు హు..మ్మ్ హు హు..



లాలిజో లాలిజో..ఊరుకో పాపాయి

పారిపోనీకుండా పట్టుకో నాచేయి..






ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment