
Song » E Musi Musi / ఈ ముసిముసి
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
E.V. Saroja / ఇ.వి. సరోజ ,
Rajasulochana / రాజసులోచన ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi: I musimusi navvula virisina puvvulu gusagusa lADinavi EmiTO virajAji gulAbi managuTTE telusukunnavi cAmaMti pUbaMti parihAsAlADinavi virajAji gulAbi managuTTE telusukunnavi cAmaMti pUbaMti parihAsAlADinavi I musimusinavvula virisina puvvulu gusagusalADinavi EmiTO caraNaM: podariMTanu oMTari pAvuramu tana jaMTanu kaliyaga vEcinadi manasE telisi tana prEyasikai magapAvuramE daricEriMdi caraNaM2: nI kurulanu rEpina cirugAli nA madilO kOrika rEpinadi valapE telipE kanusaigalatO nI Usulu bAsalu cEsAyi caraNaM3: nadilO merasi kadilE kAMti 2 nA mOmuna taLataLalADiMdi nI cakkani cekkili addAna nA rUpamu nEnu cUsAnu
పల్లవి: ఈ ముసిముసి నవ్వుల విరిసిన పువ్వులు గుసగుస లాడినవి ఏమిటో విరజాజి గులాబి మనగుట్టే తెలుసుకున్నవి చామంతి పూబంతి పరిహాసాలాడినవి విరజాజి గులాబి మనగుట్టే తెలుసుకున్నవి చామంతి పూబంతి పరిహాసాలాడినవి ఈ ముసిముసినవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో చరణం: పొదరింటను ఒంటరి పావురము తన జంటను కలియగ వేచినది మనసే తెలిసి తన ప్రేయసికై మగపావురమే దరిచేరింది చరణం2: నీ కురులను రేపిన చిరుగాలి నా మదిలో కోరిక రేపినది వలపే తెలిపే కనుసైగలతో నీ ఊసులు బాసలు చేసాయి చరణం3: నదిలో మెరసి కదిలే కాంతి 2 నా మోమున తళతళలాడింది నీ చక్కని చెక్కిలి అద్దాన నా రూపము నేను చూసాను
0 comments:
Post a Comment