Wednesday, July 29, 2020

Guruvuni Minchina Sishyudu » A divyalokala      గురువుని మించిన శిష్యుడు » ఏ దివ్యలోకాల

July 29, 2020 Posted by Publisher , No comments

Song » A divyalokala / ఏ దివ్యలోకాల
Song Details:Actor : Kantha Rao / కాంతా రావు ,Actress : Krishna kumari / కృష్ణ కుమారి  ,Music Director : S.P. Kodandapani / ఎస్.పి. కోదండపాణి  ,Lyrics Writer : GK Murthy / జి.కె. మూర్తి  ,Singer : P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,Song Category : Others
E divyalOkAla ElETi  dEvatO
avanipai  I lIla avatariMce
rUpoMdu aMdAla rASi   yI elanAga
padunAru  vannela pasiDi tIga
maccalEni caMdamAma... maccalEni   caMdamAma  I nemmOmu
mOvi kAdadi tEnela bAvi kAni
tilakiMca niluvella pulakiMpulE  pUce
tolivalapu nAlOna  toMgi cUce.....
Silpi madilOna kalpana SilpamIme
citrakAruni BAvanA  citra mIme
kavikalala kadilETi kAvva mIme 
rAga raMjita praNaya svarUpa mIme
E divvalokAla ElETi dEvatO
avanipai   IlIla avatariMce
ఏ దివ్యలోకాల ఏలేటి  దేవతో
అవనిపై  ఈ లీల అవతరించె
రూపొందు అందాల రాశి   యీ ఎలనాగ
పదునారు  వన్నెల పసిడి తీగ
మచ్చలేని చందమామ... మచ్చలేని   చందమామ  ఈ నెమ్మోము
మోవి కాదది తేనెల బావి కాని
తిలకించ నిలువెల్ల పులకింపులే  పూచె
తొలివలపు నాలోన  తొంగి చూచె.....
శిల్పి మదిలోన కల్పన శిల్పమీమె
చిత్రకారుని భావనా  చిత్ర మీమె
కవికలల కదిలేటి కావ్వ మీమె 
రాగ రంజిత ప్రణయ స్వరూప మీమె
ఏ దివ్వలొకాల ఏలేటి దేవతో
అవనిపై   ఈలీల అవతరించె

0 comments:

Post a Comment