Tuesday, July 21, 2020

Gulabi » Meghaalalo      గులాబి » మేఘాలలో

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Meghaalalo / మేఘాలలో

Song Details:Actor : J.D.Chakravarthi / జె డి చక్రవర్తి ,Actress : Maheshwari / మహేశ్వరి ,Music Director : Shashi Preetam / శశి ప్రీతమ్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Gaayatri / గాయత్రి ,  Mano (nagoor babu) / మనో (నాగూర్ బాబు)  ,Song Category : Devotional Songs
mEGaalalO tElipOmannadi 
tUPaanulaa rEgipomannadi
ammaayitO saagutU cilipi madi
bIT in mai haarT eMdukiMta kottaguMdi
hIT in mai taaT veMTabaDi cuTTukuMdi
O mai gaaD EmiTiMta kottagunnadi
bIT in mai haarT eMdukiMta kottaguMdi
hIT in mai taaT veMTabaDi cuTTukuMdi
O mai gaaD EmiTiMta kottagunnadi



hallO pillaa aMTU aakataayi aanaMdaalu
aalapistU uMTE swaagataalE saMgItaalu
aaDadaa nemali tIrugaa manasu Gal Gal Gallumani
aakaashamE haddu paavuraayi paapaayiki
aagE maaTE vaddu aMdamaina allarlaki
paaradaa varada hOrugaa vayasu Jal Jal Jallumani
O namaH vacci paDu Uhalaku
O namaH kaLLuviDu aashalaku
O namaH iShTamaina alajaDiki



naccinaTTE uMdi reccipOyE picci spIDu
vaddaMTunnaa viMdE ceMgumaMTU ciMdE IDu
guvvalaa rivvu rivvuna yavvanaM eTupOtuMdi
kaTTa lEka IDu nannu meccukuMdi nEDu
paMdeM vEstaa cUDU paTTalEDu nannevvaDU
aMtagaa beduru eMduku manaku eduriMkEmuMdi
nI taraha koMpa muMcETaTTE uMdi
naa salahaa aalakistE sEPTI uMdi
EMTi mahaa aMta jOru kaasta nemmadi



bIT in mai haarT eMdukiMta kottaguMdi
hIT in mai taaT veMTabaDi cuTTukuMdi
O mai gaaD EmiTiMta kottagunnadi
bIT in mai haarT 
hIT in mai taaT
O mai gaaD
 
Click here to hear the song
మేఘాలలో తేలిపోమన్నది 
తూఫానులా రేగిపొమన్నది
అమ్మాయితో సాగుతూ చిలిపి మది
బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొత్తగుంది
హీట్ ఇన్ మై తాట్ వెంటబడి చుట్టుకుంది
ఓ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నది
బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొత్తగుంది
హీట్ ఇన్ మై తాట్ వెంటబడి చుట్టుకుంది
ఓ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నది



హల్లో పిల్లా అంటూ ఆకతాయి ఆనందాలు
ఆలపిస్తూ ఉంటే స్వాగతాలే సంగీతాలు
ఆడదా నెమలి తీరుగా మనసు ఘల్ ఘల్ ఘల్లుమని
ఆకాశమే హద్దు పావురాయి పాపాయికి
ఆగే మాటే వద్దు అందమైన అల్లర్లకి
పారదా వరద హోరుగా వయసు ఝల్ ఝల్ ఝల్లుమని
ఓ నమః వచ్చి పడు ఊహలకు
ఓ నమః కళ్ళువిడు ఆశలకు
ఓ నమః ఇష్టమైన అలజడికి



నచ్చినట్టే ఉంది రెచ్చిపోయే పిచ్చి స్పీడు
వద్దంటున్నా విందే చెంగుమంటూ చిందే ఈడు
గువ్వలా రివ్వు రివ్వున యవ్వనం ఎటుపోతుంది
కట్ట లేక ఈడు నన్ను మెచ్చుకుంది నేడు
పందెం వేస్తా చూడూ పట్టలేడు నన్నెవ్వడూ
అంతగా బెదురు ఎందుకు మనకు ఎదురింకేముంది
నీ తరహ కొంప ముంచేటట్టే ఉంది
నా సలహా ఆలకిస్తే సేఫ్టీ ఉంది
ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది



బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొత్తగుంది
హీట్ ఇన్ మై తాట్ వెంటబడి చుట్టుకుంది
ఓ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నది
బీట్ ఇన్ మై హార్ట్ 
హీట్ ఇన్ మై తాట్
ఓ మై గాడ్
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment