Saturday, July 11, 2020

Govula Gopanna » Vinara Vinara Narudaa      గోవుల గోపన్న » వినరా వినరా నరుడా

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Vinara Vinara Narudaa / వినరా వినరా నరుడా
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Rajasri / రాజశ్రీ ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
pallavi:

    O...O...O...o...o...

    vinarA vinarA naruDA...telusukOra pAmaruDA ...

    vinarA vinarA naruDA...telusukOra pAmaruDA ...

    gOmAtanu nEnErA ...nAtO saripOlavurA

    vinarA vinarA naruDA...telusukOra pAmaruDA ...



caraNaM 1:

    kallAkapaTaM yerugani gaMgIgOvunu nEnU

    Edi ceppinA kAdani eduru ceppalEnu

    pArEsina gaDDi tinI bratuku gaDuputunnAnu

    pArEsina gaDDi tinI bratuku gaDuputunnAnu...

    parula sEvakE sarvaM tyAgaM cEstunnAnu..

    vinarA vinarA naruDA...telusukOra pAmaruDA ...



caraNaM 2:

    kammanaina gummapAlu kaDavalatO istunnA...

    nA dUDala kAdani mI kaDupulu niMDistunnA

    vayasuDiginanADu nannu kaTikivAni pAlcEstE

    vayasuDiginanADu nannu kaTikivAni pAlcEstE

    usuru gOlupOyi mIkE upayEgistunnAnu

    vinarA vinarA naruDA...telusukOra pAmaruDA ..



caraNaM 3:

    nA biDDalu BUmicIlci dukki dunnutunnavOy...

    nA yeruvuna pairu perigi paMTa paMDutunnadOy..

    nA carmame mI kAliki ceppulugA mArunOy...

    nA carmame mI kAliki ceppulugA mArunOy...

    nA oLLe DhaMkAlaku nAdamu puTTiMcunOy...



    vinarA vinarA naruDA...telusukOra pAmaruDA ..


 
Click here to hear the song
పల్లవి:

    ఓ...ఓ...ఓ...ఒ...ఒ...

    వినరా వినరా నరుడా...తెలుసుకోర పామరుడా ...

    వినరా వినరా నరుడా...తెలుసుకోర పామరుడా ...

    గోమాతను నేనేరా ...నాతో సరిపోలవురా

    వినరా వినరా నరుడా...తెలుసుకోర పామరుడా ...



చరణం 1:

    కల్లాకపటం యెరుగని గంగీగోవును నేనూ

    ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను

    పారేసిన గడ్డి తినీ బ్రతుకు గడుపుతున్నాను

    పారేసిన గడ్డి తినీ బ్రతుకు గడుపుతున్నాను...

    పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను..

    వినరా వినరా నరుడా...తెలుసుకోర పామరుడా ...



చరణం 2:

    కమ్మనైన గుమ్మపాలు కడవలతో ఇస్తున్నా...

    నా దూడల కాదని మీ కడుపులు నిండిస్తున్నా

    వయసుడిగిననాడు నన్ను కటికివాని పాల్చేస్తే

    వయసుడిగిననాడు నన్ను కటికివాని పాల్చేస్తే

    ఉసురు గోలుపోయి మీకే ఉపయేగిస్తున్నాను

    వినరా వినరా నరుడా...తెలుసుకోర పామరుడా ..



చరణం 3:

    నా బిడ్డలు భూమిచీల్చి దుక్కి దున్నుతున్నవోయ్...

    నా యెరువున పైరు పెరిగి పంట పండుతున్నదోయ్..

    నా చర్మమె మీ కాలికి చెప్పులుగా మారునోయ్...

    నా చర్మమె మీ కాలికి చెప్పులుగా మారునోయ్...

    నా ఒళ్ళె ఢంకాలకు నాదము పుట్టించునోయ్...



    వినరా వినరా నరుడా...తెలుసుకోర పామరుడా ..


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment