Sunday, July 26, 2020

Govindudu Andari vadele » Ra...Rakumaraa...      గోవిందుడు అందరి వాడేలే » రా రాకుమారా

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Ra...Rakumaraa... / రా రాకుమారా

Song Details:Actor : Ram Charan Teja / రామ్ చరణ్ తేజ  ,Actress : Kajal / కాజల్ ,Music Director : Yuvanshankar raja / యువన్ శంకర్ రాజా ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Chinmayi / చిన్మయి  ,Song Category : Love & Romantic Songs
రా రాకుమారా రాజసాన ఏలగా

ఎదపై చేరనీరా పూలమాలె నేనుగా

నీవు తీసె శ్వాసలో

ఊయలూగే ఆశతో

పంపుతున్నా నా ప్రాణాన్ని నీ వైపుగా...



చరణం:

నీ తలపులతో మరిగిపోయె ఒంటరి తనమూ ఇష్టమే

నీ కబురులతో కరిగిపోయె ప్రతి ఒక క్షణమూ ఇష్టమే

కలలే నిజమయేలా కళ్లు తెరిచిన కోరిక ఇష్టం

నిజమే కల అయేలా ఒళ్లు మరచిన అయోమయం మరింత ఇష్టం



చరణం 2:

బరువనిపించే బిడియమంతా నీ చేతులలో వాలనీ

బతకడమంటే ఎంత మధురం నీ చేతలలో తెలియనీ

నేనేం చేసుకోను నీకు పంచని ఈ హృదయాన్ని

ఇంకేం కోరుకోను నిన్ను మించిన మరోవరం ఏదైనా గానీ..

0 comments:

Post a Comment