Song » Neeli rangu cheeralona / నీలిరంగు చీరలోన
Song Details:Actor :
Ram Charan Teja / రామ్ చరణ్ తేజ ,Actress :
Kajal / కాజల్ ,Music Director :
Yuvanshankar raja / యువన్ శంకర్ రాజా ,Lyrics Writer :
Suddaala Ashok Teja / సుద్దాల అశోక్ తేజ ,Singer :
Hari Haran / హరిహరన్ ,Song Category : Love & Romantic Songs
నీలిరంగు చీరలోన - చందమామ నీవే భామా ఎట్ట నిన్ను అందుకోనే ఏడు రంగులున్న నడుము బొంగరంల తిప్పేదానా నిన్ను ఎట్ట అదుముకోనే ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలిచ్చి కవ్విస్తావే అంతలోనే జారిపోతావే మెరుపల్లె మెరిసే జాణ వరదల్లె ముంచే జాణ ఈ భూమిపైన నీ మాయలోన పడనోడు ఎవడే జాణ జాణ అంటే జీవితం, జీవితం నెరజాణరా దానితో సైయ్యాడరా ఎదురీదరా ఏటికీ ఎదురీదరా చరణం:1 రాక రాక నీకైవచ్చీ పున్నమంటి చిన్నది ఇచ్చే కౌగిలింతె బతుకున వచ్చే సుఖమని పూవ్వులాగ ఎదురే వచ్చి ముల్లులాగ ఎదలో గుచ్చీ మాయమయ్యె భామవంటిదే ఏదీ కడదాకా రాదని తెలుపుతుంది నీ జీవితం నీతో నువు అతిధివనుకోని పో.....ర....పోరా....పో..... జాణకాని జాణరా - జీవితం నెరజాణరా జీవితం ఒకవింతర - ఆడుకుంటె పూబంతి చరణం:2 సాహసాల పొలమే దున్నీ పంట తీసె బలమే వుంటే ప్రతీరోజు ఒక సంక్రాంతి అవుతుందిరా బతుకు పోరు బరిలో నిలిచీ నీకు నువ్వె ఆయుధమైతే ప్రతీపూట విజయదశమీ వస్తుందిరా నీపై విధి విసిరె నిప్పుతో ఆడుకుంటే దీపావళి చెయ్ రా ప్రతి ఘడియ పండుగే చెయ్ ర... చెయేర ....చెవ్.. జీవితం ఒక జాతర చేయడానికే జన్మరా జీవితం ఒక జాతర చేయడానికే జన్మరా జీవితం అను రంగుల రాట్నమెక్కి ఊరేగరా
0 comments:
Post a Comment