Sunday, July 19, 2020

Govinda Govinda » Andamaa Anduma      గోవిందా గోవిందా » అందమా అందుమా

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Andamaa Anduma / అందమా అందుమా

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Sridevi / శ్రీదేవి ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
aMdamaa aMdumaa aMdanaMTE aMdamaa
Caitramaa cErumaa cEranaMTE nyaayamaa
praaNamunna paiDibomma paarijaata pUla komma
paravashaalu paMcavamma paala saMdramaa
aMdamaa aMdumaa aMdanaMTE aMdamaa
Caitramaa cErumaa cEranaMTE nyaayamaa
praaNamunna paiDibomma paarijaata pUla komma
paravashaalu paMcavamma paala saMdramaa
aaDumaa paaDumaa maunamE maanukOvammaa
aMdamaa aMdumaa aMdanaMTE aMdamaa



aakaluMDadE daahamuMDadE aakataayi kOrika, korukkutiMTadI
aaganaMTadE daaganaMTadE aakucaaTu vEDuka, kirrekkamaMTadI
vannepUla vinnapaalu vinnaa nammI
ciTaka Elu icci ElukuMTaanammi
raasipeTTi uMdiganaka ninnE nammI
UsulannI pUsaguccI istaa sumI
aalanaa paalanaa cUDagaa cEranaa ceMta
aMdamaa aMdumaa aMdanaMTE aMdamaa
Caitramaa cErumaa cEranaMTE nyaayamaa



veyyi ceppinaa lakSha ceppinaa lakShyapeTTadE ilaa idEmi vilavilaa
tiyyatiyyagaa naccaceppanI ciccikoTTanI ilaa vayyaari vennelaa
nilavanIdu nidarapOdu naaraayaNaa
vagalamaari vayasupOru naavallanaa
cilipi aasha ciTikelOna tIrcEyanaa
maMtramEsi maMci cEsi laaliMcanaa
aadukO naayanaa aarcavaa tIrcavaa ciMta



aMdamaa aMdumaa aMdanaMTE aMdamaa
Caitramaa cErumaa cEranaMTE nyaayamaa
praaNamunna paiDibomma paarijaata pUla komma
paravashaalu paMcavamma paala saMdramaa
aaDumaa paaDumaa maunamE maanukOvammaa


Click here to hear the song
అందమా అందుమా అందనంటే అందమా
ఛైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూల కొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
అందమా అందుమా అందనంటే అందమా
ఛైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూల కొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మా
అందమా అందుమా అందనంటే అందమా



ఆకలుండదే దాహముండదే ఆకతాయి కోరిక, కొరుక్కుతింటదీ
ఆగనంటదే దాగనంటదే ఆకుచాటు వేడుక, కిర్రెక్కమంటదీ
వన్నెపూల విన్నపాలు విన్నా నమ్మీ
చిటక ఏలు ఇచ్చి ఏలుకుంటానమ్మి
రాసిపెట్టి ఉందిగనక నిన్నే నమ్మీ
ఊసులన్నీ పూసగుచ్చీ ఇస్తా సుమీ
ఆలనా పాలనా చూడగా చేరనా చెంత
అందమా అందుమా అందనంటే అందమా
ఛైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా



వెయ్యి చెప్పినా లక్ష చెప్పినా లక్ష్యపెట్టదే ఇలా ఇదేమి విలవిలా
తియ్యతియ్యగా నచ్చచెప్పనీ చిచ్చికొట్టనీ ఇలా వయ్యారి వెన్నెలా
నిలవనీదు నిదరపోదు నారాయణా
వగలమారి వయసుపోరు నావల్లనా
చిలిపి ఆశ చిటికెలోన తీర్చేయనా
మంత్రమేసి మంచి చేసి లాలించనా
ఆదుకో నాయనా ఆర్చవా తీర్చవా చింత



అందమా అందుమా అందనంటే అందమా
ఛైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూల కొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మా
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment