Monday, July 27, 2020

Gorintaku » Komma Kommako      గోరింటాకు » కొమ్మ కొమ్మకో

July 27, 2020 Posted by Publisher , No comments

Song » Komma Kommako / కొమ్మ కొమ్మకో

Song Details:Actor : Shobhan Babu / శోభన్ బాబు  ,Actress : Savithri / సావిత్రి ,  Sujatha / సుజాత ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
komma kommakO sannaayi..kOTi raagaalu unnaayi..
EmiTi maunaM??eMdukI dhyaanaM??
EmiTi maunaM??eMdukI dhyaanaM??



komma kommakO sannaayi..kOTi raagaalu unnaayi..
manasulO dhyaanaM..maaTalO maunaM..
manasulO dhyaanaM..maaTalO maunaM..



manasu maaTakaMdani naaDu..madhuramaina paaTavutuMdi..
madhuramaina vEdanalOnE.. paaTaku pallavi puDutuMdi..



manasu maaTakaMdani naaDu..madhuramaina paaTavutuMdi..
madhuramaina vEdanalOnE.. paaTaku pallavi puDutuMdi..



pallaviMcu paDucudanaM.. parucukunna mamatalu cUDu
pallaviMcu paDucudanaM.. parucukunna mamatalu cUDu
pasitanaala tolivEkuvalO..musurukunna mabbulu cUDu..



aMdukE dhyaanaM..aMdukE maunaM..
komma kommakO sannaayi..






koMTe vayasu kOrilaagaa..gOdaari urakalu cUDu
urakalEka UgisalaaDE..paDavakunna baMdaM cUDu..



koMTe vayasu kOrilaagaa..gOdaari urakalu cUDu
urakalEka UgisalaaDE..paDavakunna baMdaM cUDu..



oDDutOnO, nITitOnO.. paDava muDi paDi uMDaali!!
eppuDE muDi evaritO paDi.. paDava payanaM saagunO mari!!



aMdukE dhyaanaM..aMdukE maunaM..
aMdukE dhyaanaM..aMdukE maunaM.. 



komma kommakO sannaayi..kOTi raagaalu unnaayi..
EmiTi maunaM??eMdukI dhyaanaM??
manasulO dhyaanaM..maaTalO maunaM..



komma kommakO sannaayi..



 
Click here to hear the song
కొమ్మ కొమ్మకో సన్నాయి..కోటి రాగాలు ఉన్నాయి..
ఏమిటి మౌనం??ఎందుకీ ధ్యానం??
ఏమిటి మౌనం??ఎందుకీ ధ్యానం??



కొమ్మ కొమ్మకో సన్నాయి..కోటి రాగాలు ఉన్నాయి..
మనసులో ధ్యానం..మాటలో మౌనం..
మనసులో ధ్యానం..మాటలో మౌనం..



మనసు మాటకందని నాడు..మధురమైన పాటవుతుంది..
మధురమైన వేదనలోనే.. పాటకు పల్లవి పుడుతుంది..



మనసు మాటకందని నాడు..మధురమైన పాటవుతుంది..
మధురమైన వేదనలోనే.. పాటకు పల్లవి పుడుతుంది..



పల్లవించు పడుచుదనం.. పరుచుకున్న మమతలు చూడు
పల్లవించు పడుచుదనం.. పరుచుకున్న మమతలు చూడు
పసితనాల తొలివేకువలో..ముసురుకున్న మబ్బులు చూడు..



అందుకే ధ్యానం..అందుకే మౌనం..
కొమ్మ కొమ్మకో సన్నాయి..






కొంటె వయసు కోరిలాగా..గోదారి ఉరకలు చూడు
ఉరకలేక ఊగిసలాడే..పడవకున్న బందం చూడు..



కొంటె వయసు కోరిలాగా..గోదారి ఉరకలు చూడు
ఉరకలేక ఊగిసలాడే..పడవకున్న బందం చూడు..



ఒడ్డుతోనో, నీటితోనో.. పడవ ముడి పడి ఉండాలి!!
ఎప్పుడే ముడి ఎవరితో పడి.. పడవ పయనం సాగునో మరి!!



అందుకే ధ్యానం..అందుకే మౌనం..
అందుకే ధ్యానం..అందుకే మౌనం.. 



కొమ్మ కొమ్మకో సన్నాయి..కోటి రాగాలు ఉన్నాయి..
ఏమిటి మౌనం??ఎందుకీ ధ్యానం??
మనసులో ధ్యానం..మాటలో మౌనం..



కొమ్మ కొమ్మకో సన్నాయి..
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment