Tuesday, July 7, 2020

Gorantha Deepam » Raayinaina గోరంత దీపం » రాయినైనా

July 07, 2020 Posted by Publisher , No comments
 
Song » Raayinaina / రాయినైనా
Song Details:Actor : Sreedhar / శ్రీధర్  ,Actress : Vanisree / వాణిశ్రీ ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Club & Item Songs
raayinainaa kaakapOtini raamapaadamu sOkagaa..
bOyanainaa kaakapOtini puNya caritamu paaDagaa..



raayinainaa kaakapOtini raamapaadamu sOkagaa..
bOyanainaa kaakapOtini puNya caritamu paaDagaa..



paDavanainaa kaakapOtini swaami kaaryamu tIrcagaa
paadukainaa kaakapOtini bhakti raajyamunElagaa..



aDavilOpala pakShinaitE ativa sItanu kaacagaa..
aMduvalana raamacaMdruni  amita karuNanu nOcanaa!!



aDavilOpala pakShinaitE ativa sItanu kaacagaa..
aMduvalana raamacaMdruni  amita karuNanu nOcanaa!!



kaDali gaTTuna uDatanaitE..buData saayamu cEyanaa..
kaalamella raamabhadruni vEli gurtulu mOyanaa!!



raayinainaa kaakapOtini raamapaadamu sOkagaa..
bOyanainaa kaakapOtini puNya caritamu paaDagaa..



kaakinainaa kaakapOtini Gaatukammunu cEyucU..
gaDDipOcanu sharamu cEsE Ganata raamuDu cUpagaa!!



kaakinainaa kaakapOtini Gaatukammunu cEyucU..
gaDDipOcanu sharamu cEsE Ganata raamuDu cUpagaa!!



mahini alpa jIvulE I mahimalanni cUpagaa..
maniShinai janmiMcinaanE matsarammulu rEpagaa..
mada matsarammulu rEpagaa..



paDavanainaa kaakapOtini swaami kaaryamu tIrcagaa
paadukainaa kaakapOtini bhakti raajyamunElagaa..



raayinainaa kaakapOtini raamapaadamu sOkagaa..
bOyanainaa kaakapOtini puNya caritamu paaDagaa..



 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా..
బోయనైనా కాకపోతిని పుణ్య చరితము పాడగా..



రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా..
బోయనైనా కాకపోతిని పుణ్య చరితము పాడగా..



పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా
పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యమునేలగా..



అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచగా..
అందువలన రామచంద్రుని  అమిత కరుణను నోచనా!!



అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచగా..
అందువలన రామచంద్రుని  అమిత కరుణను నోచనా!!



కడలి గట్టున ఉడతనైతే..బుడత సాయము చేయనా..
కాలమెల్ల రామభద్రుని వేలి గుర్తులు మోయనా!!



రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా..
బోయనైనా కాకపోతిని పుణ్య చరితము పాడగా..



కాకినైనా కాకపోతిని ఘాతుకమ్మును చేయుచూ..
గడ్డిపోచను శరము చేసే ఘనత రాముడు చూపగా!!



కాకినైనా కాకపోతిని ఘాతుకమ్మును చేయుచూ..
గడ్డిపోచను శరము చేసే ఘనత రాముడు చూపగా!!



మహిని అల్ప జీవులే ఈ మహిమలన్ని చూపగా..
మనిషినై జన్మించినానే మత్సరమ్ములు రేపగా..
మద మత్సరమ్ములు రేపగా..



పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా
పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యమునేలగా..



రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా..
బోయనైనా కాకపోతిని పుణ్య చరితము పాడగా..
 
Click here to hear the song

0 comments:

Post a Comment