Wednesday, July 8, 2020

Gopala Gopala » Enduko EndukO      గోపాల గోపాల » ఎందుకో ఎందుకో

July 08, 2020 Posted by Publisher , No comments

Song » Enduko EndukO / ఎందుకో ఎందుకో
Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Music Director : Anoop Rubens / అనూప్ రూబెన్స్ ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Kailash Kher / కైలాష్ ఖేర్  ,Song Category : Inspiring & Motivational Songs
dhum ta nakara nakara nakara
dhum ta nakara nakara nakara
pilli manaki eduru paDite 
  panulu Evi    jaragavaMTa
manaM pillikeduru paDite
karma kaali caccunaMTa
balli paluku satyamaMTa
balli paluku dOSHamaMTa
nakka tOka lakku aMTa
nakka arupu dOSHamaMTa 
eMdukeMdukeMdukeMdukeMdukeMdukeMdukeMdukO
 
eMdukO eMdukO
reMDu kaaLLu manaki mukhyamaMTu
kuDikaalu muMdu aMTU 
mUDha nammakaalu eMdukO
O ... eMdukO eMdukO
jIva raasulanni daivamaMTu
jaMtu balulu iMka dEnikO
nIlOna dhairyamuMDagaa
daaraalu eMdukO
nI aatma Sakti uMDagaa
taayettuleMdukO
cEtalE cEyakaa
cEtikE raMgu raaLLu, uMgarAlu eMdukO
 
 
pErukEmo maMgaLavaaraM
panulakEmo amaMgaLaM
Sani vunna SanivaaraM
jaruputaamu SubhakaaryaM
baMDilOna vaMdalaadi parikaraalu unnagaani
iMta nimmakaaya paina aMtulEni viSvaasaM
eMdukO eMdukO
bhUmi baMti laaga tirugutuMTe
dikkulanni maarutuMTe
vaastu nammakaalu eMdukO
eMdukO eMdukO
nuvvu dRSHTi kaasta maarcukuMTe
diSHTi bommaliMka eMdukO
SUlaalni nOTi lOpala guccEdi eMdukO
paalalni puTTa lOpala pOsEdi eMdukO
sUTigaa eppuDU naDavakaa
iMka nippu lOna naDaka eMdukO
gO gO gO gO gOpaalaa
gO gO gO gO gOpaalaa
ధుమ్ త నకర నకర నకర
ధుమ్ త నకర నకర నకర
పిల్లి మనకి ఎదురు పడితె
పనులు ఏవి జరగవంట
మనం పిల్లికెదురు పడితె
కర్మ కాలి చచ్చునంట
బల్లి పలుకు సత్యమంట
బల్లి పలుకు దోషమంట
నక్క తోక లక్కు అంట
నక్క అరుపు దోషమంట 
ఎందుకెందుకెందుకెందుకెందుకెందుకెందుకెందుకో
 
ఎందుకో ఎందుకో
రెండు కాళ్ళు మనకి ముఖ్యమంటు
కుడికాలు ముందు అంటు
మూఢ నమ్మకాలు ఎందుకో
ఓ ... ఎందుకో ఎందుకో
జీవ రాసులన్ని దైవమంటు
జంతు బలులు ఇంక దేనికో
నీలోన ధైర్యముండగా
దారాలు ఎందుకో
నీ ఆత్మ శక్తి ఉండగా
తాయెత్తులెందుకో
చేతలే చేయకా
చేతికే రంగు రాళ్ళు, ఉంగరాలు ఎందుకో
 
 
పేరుకేమొ మంగళవారం
పనులకేమొ అమంగళం
శని వున్న శనివారం
జరుపుతాము శుభకార్యం
బండిలోన వందలాది పరికరాలు ఉన్నగాని
ఇంత నిమ్మకాయ పైన అంతులేని విశ్వాసం
ఎందుకో ఎందుకో
భూమి బంతి లాగ తిరుగుతుంటె
దిక్కులన్ని మారుతుంటె
వాస్తు నమ్మకాలు ఎందుకో
ఎందుకో ఎందుకో
నువ్వు దృష్టి కాస్త మార్చుకుంటె
దిష్టి బొమ్మలింక ఎందుకో
శూలాల్ని నోటి లోపల గుచ్చేది ఎందుకో
పాలల్ని పుట్ట లోపల పోసేది ఎందుకో
సూటిగా ఎప్పుడూ నడవకా
ఇంక నిప్పు లోన నడక ఎందుకో
గో గో గో గో గోపాలా
గో గో గో గో గోపాలా

0 comments:

Post a Comment