
Song » Gundello Edo Sadee / గుండెల్లో ఏదో సడీ
Song Details:Actor :
Gopichand / గోపిచంద్ ,Actress :
Priyamani / ప్రియమణి ,Music Director :
Chakri / చక్రి ,Lyrics Writer :
Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer :
Chakri / చక్రి ,
Kausalya / కౌసల్య ,Song Category : Others
guMDellO ... kaLLallO ... guMDellO EdO saDI .. uMDuMDI O alajaDI kaLLallOnU kalabaDI .. kammEstuMdI saMdaDi nA prANaM kOriMdi nannE .. nItOnE uMTAnani AnaMdaM aMTOMdi nAtO .. nuvvuMTE vastAnani tUnIgallE mAriMdi hRudayaM nuvvE kanabaDI tuLLI tuLLi pOtOMdi prAyaM telusA taDabaDI nA pedavaMculO nI pilupunnadI nI aracEtilO nA bratukunnadI innALLeMta piccONNi nEnu .. manasistuMTe tappiMcukunnA mottammIda visigiMci ninnU EdO lAga dakkiMcukunnA manasunnAdi iccEMdukE .. kanulunnAyi kalipEMdukE ani telisAka nI prEmalO .. paDipOyAnulE guMDellO EdO saDI .. uMDuMDI O alajaDI kaLLallOnU kalabaDI .. kammEstuMdI saMdaDi nI kaugiLLalO nA tala vAlcanI I giligiMtalO nE pulakiMcanI nAkO tODu kAvAli aMTU epuDU eMdukanipiMcalEdu vaddoddaMTU nE mottukunnA manasE vacci naDiciMdi nItO kannILLoste tuDicEMdukU .. saMtOShAnni paMcEMdukU evarU lEni janmeMdukU .. anipiMciMdilE guMDellO EdO saDI .. uMDuMDI O alajaDI kaLLallOnU kalabaDI .. kammEstuMdI saMdaDi nA prANaM kOriMdi nannE .. nItOnE uMTAnani AnaMdaM aMTOMdi nAtO .. nuvvuMTE vastAnani tUnIgallE mAriMdi hRudayaM nuvvE kanabaDI tuLLI tuLLi pOtOMdi prAyaM telusA taDabaDI guMDellO ... kaLLallO ... Click here to hear the song
గుండెల్లో ... కళ్ళల్లో ... గుండెల్లో ఏదో సడీ .. ఉండుండీ ఓ అలజడీ కళ్ళల్లోనూ కలబడీ .. కమ్మేస్తుందీ సందడి నా ప్రాణం కోరింది నన్నే .. నీతోనే ఉంటానని ఆనందం అంటోంది నాతో .. నువ్వుంటే వస్తానని తూనీగల్లే మారింది హృదయం నువ్వే కనబడీ తుళ్ళీ తుళ్ళి పోతోంది ప్రాయం తెలుసా తడబడీ నా పెదవంచులో నీ పిలుపున్నదీ నీ అరచేతిలో నా బ్రతుకున్నదీ ఇన్నాళ్ళెంత పిచ్చోణ్ణి నేను .. మనసిస్తుంటె తప్పించుకున్నా మొత్తమ్మీద విసిగించి నిన్నూ ఏదో లాగ దక్కించుకున్నా మనసున్నాది ఇచ్చేందుకే .. కనులున్నాయి కలిపేందుకే అని తెలిసాక నీ ప్రేమలో .. పడిపోయానులే గుండెల్లో ఏదో సడీ .. ఉండుండీ ఓ అలజడీ కళ్ళల్లోనూ కలబడీ .. కమ్మేస్తుందీ సందడి నీ కౌగిళ్ళలో నా తల వాల్చనీ ఈ గిలిగింతలో నే పులకించనీ నాకో తోడు కావాలి అంటూ ఎపుడూ ఎందుకనిపించలేదు వద్దొద్దంటూ నే మొత్తుకున్నా మనసే వచ్చి నడిచింది నీతో కన్నీళ్ళొస్తె తుడిచేందుకూ .. సంతోషాన్ని పంచేందుకూ ఎవరూ లేని జన్మెందుకూ .. అనిపించిందిలే గుండెల్లో ఏదో సడీ .. ఉండుండీ ఓ అలజడీ కళ్ళల్లోనూ కలబడీ .. కమ్మేస్తుందీ సందడి నా ప్రాణం కోరింది నన్నే .. నీతోనే ఉంటానని ఆనందం అంటోంది నాతో .. నువ్వుంటే వస్తానని తూనీగల్లే మారింది హృదయం నువ్వే కనబడీ తుళ్ళీ తుళ్ళి పోతోంది ప్రాయం తెలుసా తడబడీ గుండెల్లో ... కళ్ళల్లో ... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment