Tuesday, July 21, 2020

Gokulam lo Seetha » Premaa Premaa      గోకులంలో సీత » ప్రేమా ప్రేమా

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Premaa Premaa / ప్రేమా ప్రేమా

Song Details:Actor : Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress : Raasi / రాశి ,Music Director : Koti / కోటి ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

    prEmA prEmA O prEmA pilupunu vinavammA

    prEmA prEmA O prEmA pilupunu vinavammA

    prANaM pOsE amRutamA viShamai pOkammA

    valapula vanamA A...A...A...

    velugula varamA A..A..A...

    I edalO koluvuMduvu rAvammA



    prEmA prEmA O prEmA pilupunu vinavammA

    prANaM pOsE amRutamA viShamai pOkammA



caraNaM 1:

    eMta madhanamO jaragakuMDa

    A pAla kaDali kadiliMdA amRutakalaSamaMdiMdA

    enni urumulO visarakuMDa

    A nIliniMgi karigiMdA nElagoMtu taDipiMdA

    prati kShaNaM hRudayaM aDaganidE caluvanIyava prEmA

    prakRutilO praLayaM rEganidE cigurutoDagava prEmA

    aNuvaNuvU samidhalAyE I yAgaM SAMticEdepuDammA



    prEmA prEmA O prEmA pilupunu vinavammA

    prANaM pOsE amRutamA viShamai pOkammA



caraNaM 2:

    AyuvaMtA anurAga dEvataki

    hAratIyadalicADu AripOtu unnADu

    mAyamaina mamakAramEdi ani

    gAlinaDugutunnADu jAli paDava InADu

    niluvunA ragilE vEdanalO vilayajvAlalu cUDu

    praNayamE gelicE madhurimatO celimijOlalu pADu

    nIvaMTU lEkuMTE I sthitilO EmautADOnammA



    prEmA prEmA O prEmA pilupunu vinavammA

    prANaM pOsE amRutamA viShamai pOkammA

    valapula vanamA A..A..A..

    velugula varamA A..A..A..

    I edalO koluvuMduvu rAvammA
పల్లవి:

    ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా

    ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా

    ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా

    వలపుల వనమా ఆ...ఆ...ఆ...

    వెలుగుల వరమా ఆ..ఆ..ఆ...

    ఈ ఎదలో కొలువుందువు రావమ్మా



    ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా

    ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా



చరణం 1:

    ఎంత మధనమో జరగకుండ

    ఆ పాల కడలి కదిలిందా అమృతకలశమందిందా

    ఎన్ని ఉరుములో విసరకుండ

    ఆ నీలినింగి కరిగిందా నేలగొంతు తడిపిందా

    ప్రతి క్షణం హృదయం అడగనిదే చలువనీయవ ప్రేమా

    ప్రకృతిలో ప్రళయం రేగనిదే చిగురుతొడగవ ప్రేమా

    అణువణువూ సమిధలాయే ఈ యాగం శాంతిచేదెపుడమ్మా



    ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా

    ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా



చరణం 2:

    ఆయువంతా అనురాగ దేవతకి

    హారతీయదలిచాడు ఆరిపోతు ఉన్నాడు

    మాయమైన మమకారమేది అని

    గాలినడుగుతున్నాడు జాలి పడవ ఈనాడు

    నిలువునా రగిలే వేదనలో విలయజ్వాలలు చూడు

    ప్రణయమే గెలిచే మధురిమతో చెలిమిజోలలు పాడు

    నీవంటూ లేకుంటే ఈ స్థితిలో ఏమౌతాడోనమ్మా



    ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా

    ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా

    వలపుల వనమా ఆ..ఆ..ఆ..

    వెలుగుల వరమా ఆ..ఆ..ఆ..

    ఈ ఎదలో కొలువుందువు రావమ్మా

0 comments:

Post a Comment