Song » Ramachakkani seethaki / రామచక్కని సీతకి
Song Details:Actor :
Sumanth / సుమంత్ ,Actress :
Kamalini Mukharjee / కమలినీ ముఖర్జీ ,Music Director :
K.M.Radha Krishnan / కె.యమ్.రాధాకృష్ణన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Gaayatri / గాయత్రి ,Song Category : Occassional Songs
nIla gagana Ganavicalana dharaNijaa shrIramaNa madhura vadana naLina nayana manavi vinaraa raamaa raama cakkani sItakI aracEta gOriMTa iMta cakkani cukkakI iMkevaru moguDaMTa raama cakkani sItakI.. puData vIpuna vElu viDicina puDami alluDu raamuDE eDama cEtanu shivuni villunu ettina aa raamuDE ettagalaDaa sIta jaDanu taaLi kaTTE vELalO raama cakkani sItakI.. erra jaabili cEyi gilli raamuDEDani aDugutuMTE cUDalEdani pedavi ceppi ceppalEmani kanulu ceppE nallapUsainaaDu dEvuDu nallani raGuraamuDu raama cakkani sItakI.. cukkanaDigaa dikkunaDigaa cemmagillina cUpunaDigaa nIru poMgina kanulalOna nITi teralE aDDu nilacE cUsukOmani manassu telipI manassu maaTalu kaadugaa raama cakkani sItakI raama cakkani sItakI aracEta gOriMTa iMta cakkani cukkakI iMkevaru moguDaMTa raama cakkani sItakI.. iMduvadana kuMdaradana maMda gamana Baamaa eMduvalana iMduvadana iMta madanaa prEmaa.. Click here to hear the song
నీల గగన ఘనవిచలన ధరణిజా శ్రీరమణ మధుర వదన నళిన నయన మనవి వినరా రామా రామ చక్కని సీతకీ అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకీ ఇంకెవరు మొగుడంట రామ చక్కని సీతకీ.. పుడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో రామ చక్కని సీతకీ.. ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే చూడలేదని పెదవి చెప్పి చెప్పలేమని కనులు చెప్పే నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు రామ చక్కని సీతకీ.. చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డు నిలచే చూసుకోమని మనస్సు తెలిపీ మనస్సు మాటలు కాదుగా రామ చక్కని సీతకీ రామ చక్కని సీతకీ అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకీ ఇంకెవరు మొగుడంట రామ చక్కని సీతకీ.. ఇందువదన కుందరదన మంద గమన భామా ఎందువలన ఇందువదన ఇంత మదనా ప్రేమా.. ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment