Tuesday, July 28, 2020

Geethanjali » Om namaha      గీతాంజలి » ఓం నమః

July 28, 2020 Posted by Publisher , No comments

Song » Om namaha / ఓం నమః

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Girija / గిరిజ ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
U.. U.. U.. U..
 
OM namaH nayana shRutulaku OM namaH hRudayalayalaku OM..
OM namaH adhara jatulaku OM namaH madhura smRutulaku OM..
nI hRudayaM tapana telisI naa hRudayaM kanulu taDisE vELalO..
I maMcu bommalokaTai..kaugililO kalisi karigE lIlalO!!
 
rEgina kOrikalatO .. gaalulu vIcagaa..
jIvana vENuvulalO.. mOhana paaDagaa
dUramu lEnidai..lOkamu tOcagaa..
kaalamu lEnidai.. gaganamu aMdagaa..
sUrIDE origi odigi jaabilli oDini aDigE vELaa..
muddulaa..poddukE..nidura lEpE praNaya gItiki OM!!
 
oMTari baaTasaarI.. jaMTaku cEragaa..
kaMTiki paapavaitE..reppagaa maaranaa
tUrupu nIvugaa..vEkuva nEnugaa..
allika paaTagaa..pallavi prEmagaa
prEmiMcE pedavulokaTai poMgiMcE sudhalu manavaitE..
jagatikE..atidhulai..jananamaMdina prEma jaMTaki!!
 
OM namaH nayana shRutulaku OM namaH hRudayalayalaku OM..
OM namaH adhara jatulaku OM namaH madhura smRutulaku OM..
nI hRudayaM tapana telisI naa hRudayaM kanulu taDisE vELalO..
I maMcu bommalokaTai..kaugililO kalisi karigE lIlalO!!
Click here to hear the song
ఊ.. ఊ.. ఊ.. ఊ..
 
ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయలయలకు ఓం..
ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం..
నీ హృదయం తపన తెలిసీ నా హృదయం కనులు తడిసే వేళలో..
ఈ మంచు బొమ్మలొకటై..కౌగిలిలో కలిసి కరిగే లీలలో!!
 
రేగిన కోరికలతో .. గాలులు వీచగా..
జీవన వేణువులలో.. మోహన పాడగా
దూరము లేనిదై..లోకము తోచగా..
కాలము లేనిదై.. గగనము అందగా..
సూరీడే ఒరిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా..
ముద్దులా..పొద్దుకే..నిదుర లేపే ప్రణయ గీతికి ఓం!!
 
ఒంటరి బాటసారీ.. జంటకు చేరగా..
కంటికి పాపవైతే..రెప్పగా మారనా
తూరుపు నీవుగా..వేకువ నేనుగా..
అల్లిక పాటగా..పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే..
జగతికే..అతిధులై..జననమందిన ప్రేమ జంటకి!!
 
ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయలయలకు ఓం..
ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం..
నీ హృదయం తపన తెలిసీ నా హృదయం కనులు తడిసే వేళలో..
ఈ మంచు బొమ్మలొకటై..కౌగిలిలో కలిసి కరిగే లీలలో!!



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment