Song » Gala Gala Gala Gangotri / గల గల గల గంగోత్రి
Song Details:Actor :
Allu-Arjun / అల్లు అర్జున్ ,Actress :
Adithi Agarwal / అదితి అగర్వాల్ ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Ganga / గంగ ,
Kalpana / కల్పన ,
MM. Keeravani / ఎమ్.ఎమ్ కీరవాణి ,
Srivardhini / శ్రీవర్ధిని ,Song Category : Others
a: OM...jIvana vAhinI...pAvanI.... kaliyugamuna kalpataruvu nIDa nIvanI kanulu tuDucu kAmadhEnu tODu nIvani kO: varamulicci Bayamu tIrci SuBamu gUrcu gaMgAdEvi a: ninu kolicina cAlunammA sakala lOka pAvani Buvini taDipi diviga malaci suDulu tirigu SuBagAtrI gaMgOtri.... kO:gaMgOtri.... a: gaMgOtri.... kO: gaMgOtri.... kO: gaMgOtri.... gala gala gala gaMgOtri. himagiri jani hari putri ||2|| a; jIvana vAhinI.... pAvanI... A.....A....A....A... maMcukoMDalOna oka koMDavAgulA ila jananamoMdina virajA vAhinI... kO: sAnidagarisanidapamagari sari sari gama gama garisa a: viShNu caraNamE tana puTTinillugA Sivagiriki cErina sura gaMga nIvanI... kO: sasasarisari garigamagama dapa dapa dapa dapa gari sari sari sari a: attiMTiki sirula nosagu alakanaMdavai sagara kulamu kApADina BAgIradhIvai badarIvana hRuShikESa haridvAra prayAgamula maNi karNika tana lOpala velasina SrI vAraNAsi gaMgOtri.... kO: gaMgOtri.... a:gaMgOtri.... kO: gaMgOtri.... kO: gala gala gala gaMgOtri. himagiri jani hariputri.... kO: pasupu kuMkumatO..pAlu pannITitO...SrIgaMdhapu dhAratO... paMcAmRutAlatO.... aMgAMgaM taDuputU...dOShAlanu kaDugutU... gaMgOtriki jaruputunna aByaMgana snAnaM a: ammA... gaMgammA... kRuShNammaku ceppammA kaShTaM kaligiMcoddani yamunaku ceppAmmA sAyamunaku venakADoddanI gOdArikI... kAvErIki...ETiki ....selayETiki ...kurisETi jaDivAnaki... dUkE jalapAtAniki....nI tObuTTuvulaMdarikI..ceppammA... mA gaMgammA jIva nadivigA... oka mOkSha nidhivigA...paMDlu pUlu pasupulA pArANi rANigA... kO: Sivuni jaTalanE tana nATya jatulugA jalaka mADu satulaku sauBAgya dAtrigA.... a: gaMDAlanu pApAlanu kaDigivEyagA....mukti nadini mUDu munakalE cAlugA jaladIvena talakupOsE jananI gaMgABavAni Ame aMDa maMcu koMDa vADani siga pUdaMDa ...gaMgOtri.... kO: gaMgOtri.... a:gaMgOtri....kO:gaMgOtri.... gala gala gaMgOtri.... himagiri jani hariputri ||3|| a: jIvana vAhinI ...pAvanI.... Click here to hear the song
అ: ఓం...జీవన వాహినీ...పావనీ.... కలియుగమున కల్పతరువు నీడ నీవనీ కనులు తుడుచు కామధేను తోడు నీవని కో: వరములిచ్చి భయము తీర్చి శుభము గూర్చు గంగాదేవి అ: నిను కొలిచిన చాలునమ్మా సకల లోక పావని భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరిగు శుభగాత్రీ గంగోత్రి.... కో:గంగోత్రి.... అ: గంగోత్రి.... కో: గంగోత్రి.... కో: గంగోత్రి.... గల గల గల గంగోత్రి. హిమగిరి జని హరి పుత్రి ||౨|| అ; జీవన వాహినీ.... పావనీ... ఆ.....ఆ....ఆ....ఆ... మంచుకొండలోన ఒక కొండవాగులా ఇల జననమొందిన విరజా వాహినీ... కో: సానిదగరిసనిదపమగరి సరి సరి గమ గమ గరిస అ: విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సుర గంగ నీవనీ... కో: సససరిసరి గరిగమగమ దప దప దప దప గరి సరి సరి సరి అ: అత్తింటికి సిరుల నొసగు అలకనందవై సగర కులము కాపాడిన భాగీరధీవై బదరీవన హృషికేశ హరిద్వార ప్రయాగముల మణి కర్ణిక తన లోపల వెలసిన శ్రీ వారణాసి గంగోత్రి.... కో: గంగోత్రి.... అ:గంగోత్రి.... కో: గంగోత్రి.... కో: గల గల గల గంగోత్రి. హిమగిరి జని హరిపుత్రి.... కో: పసుపు కుంకుమతో..పాలు పన్నీటితో...శ్రీగంధపు ధారతో... పంచామృతాలతో.... అంగాంగం తడుపుతూ...దోషాలను కడుగుతూ... గంగోత్రికి జరుపుతున్న అభ్యంగన స్నానం అ: అమ్మా... గంగమ్మా... కృష్ణమ్మకు చెప్పమ్మా కష్టం కలిగించొద్దని యమునకు చెప్పామ్మా సాయమునకు వెనకాడొద్దనీ గోదారికీ... కావేరీకి...ఏటికి ....సెలయేటికి ...కురిసేటి జడివానకి... దూకే జలపాతానికి....నీ తోబుట్టువులందరికీ..చెప్పమ్మా... మా గంగమ్మా జీవ నదివిగా... ఒక మోక్ష నిధివిగా...పండ్లు పూలు పసుపులా పారాణి రాణిగా... కో: శివుని జటలనే తన నాట్య జతులుగా జలక మాడు సతులకు సౌభాగ్య దాత్రిగా.... అ: గండాలను పాపాలను కడిగివేయగా....ముక్తి నదిని మూడు మునకలే చాలుగా జలదీవెన తలకుపోసే జననీ గంగాభవాని ఆమె అండ మంచు కొండ వాడని సిగ పూదండ ...గంగోత్రి.... కో: గంగోత్రి.... అ:గంగోత్రి....కో:గంగోత్రి.... గల గల గంగోత్రి.... హిమగిరి జని హరిపుత్రి ||౩|| అ: జీవన వాహినీ ...పావనీ.... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment