Thursday, July 23, 2020

Gang Leader » Vaama Vaama velluvaaye      గ్యాంగ్ లీడర్ » వాన వాన వెల్లువాయే

July 23, 2020 Posted by Publisher , No comments
Gang-Leader-Sarigama

Song » Vaama Vaama velluvaaye / వాన వాన వెల్లువాయే
Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Vijayashanthi / విజయశాంతి ,Music Director : Bappi Lahari / బప్పీలహరి ,Lyrics Writer : Bhuvana Chandra / భువన చంద్ర  ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi :

vaana vaana velluvaayae koMDakOna tuLlipOyae

cheliya choopulae chilipi jallulai

maenu taakagaa aedO aedO aedO haayi

vaana vaana velluvaayae koMDakOna tuLlipOyae

priyuni Svaasalae pillagaalulai

mOmu taakagaa aedO aedO aedO haayi
charaNaM : 1

chakkani chekkili chiMdae aMdapu gaMdhaM

pakkana chaerina maga maharaajuki soMtaM

tolakari chiTapaTa chinukulalO makaraMdaM

chittaDi puttaDi naelakadae aanaMdaM

chivuruTaakula chaliki oNukutoo cheliya chaeragaa aedO aedO aedO haayi

vaana vaana velluvaayae koMDakOna tuLlipOyae
charaNaM : 2

okariki okarai hattukupOyina vaeLa

oDilO raegenu aedO teliyani jvaala

musirina cheekaTilO chirugaalula gOla

bigisina kaugiTa karigiMchenu paruvaala

kalavariMtalae palakariMpulai padunu meeragaa aedO aedO aedO haayi

vaana vaana velluvaayae koMDakOna tuLlipOyae

priyuni Svaasalae pillagaalulai

mOmu taakagaa aedO aedO aedO haayi
పల్లవి :

వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే

చెలియ చూపులే చిలిపి జల్లులై

మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే

ప్రియుని శ్వాసలే పిల్లగాలులై

మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి

చరణం : 1

చక్కని చెక్కిలి చిందే అందపు గంధం

పక్కన చేరిన మగ మహరాజుకి సొంతం

తొలకరి చిటపట చినుకులలో మకరందం

చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం

చివురుటాకుల చలికి ఒణుకుతూ చెలియ చేరగా ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే

చరణం : 2

ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళ

ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల

ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల

బిగిసిన కౌగిట కరిగించెను పరువాల

కలవరింతలే పలకరింపులై పదును మీరగా ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే

ప్రియుని శ్వాసలే పిల్లగాలులై

మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి

0 comments:

Post a Comment