Song » Siri siri poolaa / సిరి సిరి పూలా
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Balakrishna / బాలకృష్ణ ,Actress :
Roja / రోజా ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
M.M. Keeravani / ఎం.ఎం. కీరవాణి ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: A A A ..... siri siri pUlA cellAyi pApA sImaMtamEnADE pulakala kommA puNyAla remmA pEraMTamEnADE ASagA madhumAsamE aDigiMdi I mATA Ugaka mana UyalA aligiMdi I pUTA caraNaM 1: vEyaMdAlalO nelavaMkA I nElavaMkA digivaccEnA SRuMgArAlakE SelaviMkA jOlAlIlakE niduriMcEnA peLLinATi tuLLipATu tallinADu sAgunA ammacATu biDDamuMdu ayyagArikIpanA kalalE kannAnu kammagA idigO mI kAnukA cilikE valapE molakai molicE kanupApalA kanipiMcelE kaliki cilakA oDinE alikE anurAgamE cilikiMcelE siri siri pUlA cellAyi pApA sImaMtamEnADE ASagA madhumAsamE aDigiMdi I mATA caraNaM 2: mA saMsAramE madhugItaM.. pUsE yavvanA vanajAtAlE pillApApalA anubaMdhaM.. dAcEsiMdilE toligraMdhAlE gOkulAna puTTinODu koMgucATu kRuShNuDE naMdanAla aMdamaMta bAlakRuShNuDokkaDE edalO unnADu jIvuDU eduraitE dEvuDU palikE muraLI talapai nemalI adi pATagA idi ATagA prajalO Dajanai BajanE paDitE kadha kaMcikE manamiMTikE siripUla cellAyi pApA sImaMtamEnADE ASagA madhumAsamE aDigiMdi I mATA pulakala kommA puNyAlaremA pEraMTamEnADE Ugaka mana^^Uyala aligiMdi I pUTA
పల్లవి: ఆ ఆ ఆ ..... సిరి సిరి పూలా చెల్లాయి పాపా సీమంతమేనాడే పులకల కొమ్మా పుణ్యాల రెమ్మా పేరంటమేనాడే ఆశగా మధుమాసమే అడిగింది ఈ మాటా ఊగక మన ఊయలా అలిగింది ఈ పూటా చరణం 1: వేయందాలలో నెలవంకా ఈ నేలవంకా దిగివచ్చేనా శృంగారాలకే శెలవింకా జోలాలీలకే నిదురించేనా పెళ్ళినాటి తుళ్ళిపాటు తల్లినాడు సాగునా అమ్మచాటు బిడ్డముందు అయ్యగారికీపనా కలలే కన్నాను కమ్మగా ఇదిగో మీ కానుకా చిలికే వలపే మొలకై మొలిచే కనుపాపలా కనిపించెలే కలికి చిలకా ఒడినే అలికే అనురాగమే చిలికించెలే సిరి సిరి పూలా చెల్లాయి పాపా సీమంతమేనాడే ఆశగా మధుమాసమే అడిగింది ఈ మాటా చరణం 2: మా సంసారమే మధుగీతం.. పూసే యవ్వనా వనజాతాలే పిల్లాపాపలా అనుబంధం.. దాచేసిందిలే తొలిగ్రంధాలే గోకులాన పుట్టినోడు కొంగుచాటు కృష్ణుడే నందనాల అందమంత బాలకృష్ణుడొక్కడే ఎదలో ఉన్నాడు జీవుడూ ఎదురైతే దేవుడూ పలికే మురళీ తలపై నెమలీ అది పాటగా ఇది ఆటగా ప్రజలో డజనై భజనే పడితే కధ కంచికే మనమింటికే సిరిపూల చెల్లాయి పాపా సీమంతమేనాడే ఆశగా మధుమాసమే అడిగింది ఈ మాటా పులకల కొమ్మా పుణ్యాలరెమా పేరంటమేనాడే ఊగక మనఊయల అలిగింది ఈ పూటా
0 comments:
Post a Comment